ఆంధ్రప్రదేశ్‌

నా కంటే ఆర్థికవేత్త ఎవరున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కరణల ఫలాలు అందరికీ అందాలి

సమర్థత పెరిగితేనే సంపద సృష్టి అన్ని రంగాల్లో సమతుల్యత పాటించాం
లక్ష్య సాధనలో ఇదో మైలురాయి రాష్ట్ర బడ్జెట్‌పై సిఎం చంద్రబాబు

గుంటూరు, మార్చి 15: ‘ఆర్థిక సంస్కరణల ఫలాలు అన్నివర్గాల పేదలు..అర్హుల దరి చేరేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చాం. అన్ని అంశాలలో సమతుల్యత పాటించాం.. భవిష్యత్తు లక్ష్య సాధనలో ఇవాళ్టి బడ్జెట్ ఓ మైలురాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్ ప్రాధాన్యతలపై సిఎం స్పందించారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి సమతుల్యతతో బడ్జెట్‌ను రూపొందించామన్నారు. వచ్చే 15 ఏళ్లలో 12నుంచి 15శాతం వృద్ధిరేటు సాధించడం ద్వారా కుటుంబ వికాసం సాధ్యపడుతుందన్నారు. ఐటి రంగానికి కేటాయింపులు తగ్గాయని విలేఖర్లు ప్రస్తావించగా సిఎం స్పందిస్తూ నాకంటే ఆర్థికవేత్త ఎవరున్నారని ఎదురు ప్రశ్నించారు. ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు ఉన్నాయన్నారు. సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధికి రూ. 16వేల కోట్లు కేటాయించామని ప్రతి కుటుంబం సాధికారత సాధించాలనే లక్ష్యంతో కేటాయింపులు జరిపామన్నారు. పేదల పక్షాన ఆలోచించినందు వల్లే పౌరసరఫరాల బియ్యానికి 2800 కోట్లు, పెన్షన్లకు 4376 కోట్లు విద్యుత్ సబ్సిడీకి 3300 కోట్లు, గృహ నిర్మాణానికి 14వందల కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించామని వివరించారు. ఇవికాక చంద్రన్న బీమా, రుణ మాఫీతో పాటు కొత్తగా రూ.500 కోట్లతో నిరుద్యోగ యువతకు భృతి కల్పించాలని నిర్ణయించామన్నారు. గత ఏడాది ప్రణాళికావ్యయాన్ని 93.94 శాతం తగ్గించటంతో పాటు ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రెవిన్యూ లోటు తగ్గించి 3.06శాతానికి జిఎస్‌డిపిని తీసుకు రాగలిగామన్నారు. అన్ని విభాగాలను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయటం ఇదే తొలిసారి అని అన్నారు. మహిళాభ్యున్నతికి 33శాతం నిధులతో పాటు బలహీనవర్గాల సంక్షేమానికి 10వేల కోట్లతో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎస్‌టిలకు 9547 కోట్లు, గిరిజన సంక్షేమానికి 3502, మైనారిటీల సంక్షేమానికి ఎన్నడూలేని విధంగా 840కోట్లు కేటాయించామని వివరించారు. క్రిస్టియన్ కార్పొరేషన్‌కు 35కోట్లు అదనపునిధులు, ఆదాయ వనరులు వచ్చే ప్రాజెక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల ఫలితంగా వ్యవసాయంలో 14 శాతం వృద్ధిరేటు సాధించ గలిగామన్నారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఆదాయం, దిగుబడి పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ రెండు రంగాల ప్రాధాన్యత వల్ల త్వరలో రాష్ట్రానికి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తాయన్నారు. వచ్చే రెండేళ్లలో దేశంలోకెల్లా అత్యధిక వృద్ధిరేటును మత్స్య పరిశ్రమ ద్వారా సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జిఎస్‌డిపి కంట్రిబ్యూషన్ 30 శాతానికి పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుందని, సేవల రంగానికి ఆదాయ వనరులు సమకూరతాయని తెలిపారు. దీనివల్ల పారిశ్రామిక ప్రగతి సాధ్యపడగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు. నెలకు ఒక్కో కుటుంబానికి పదివేల తలసరి ఆదాయం సాధించే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన జరిగిందని వివరించారు. ఐటి రంగానికి ప్రాధాన్యత మరింత పెంచుతామన్నారు. కేంద్ర పథకాలు, ఇఎపి కలిపి 60శాతంగా ఉందని, సంస్కరణలు, సమర్థత పెంచటానికైతే దాంతో సంపద సృష్టించవచ్చని చెప్పారు. సమర్థత పెరగాలంటే ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలన్నారు. సంపదను రియల్‌టైమ్‌లో సృష్టించ గలిగామన్నారు.

చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న సిఎం