అందరికీ నచ్చే సినిమాలే చేస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్కినేని నాగచైతన్య
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. దీంతోపాటు చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.
ప్రస్తుతం ప్రేక్షకులకు నచ్చే సినిమాల్లో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఏం మాయ చేశావే, 100%లవ్, తడాఖా, ఒక లైలాకోసం వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అన్నింటికీ మించి తాతగారు, నాన్నగారితో చేసిన మనం సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది. నా కెరీర్‌లో అది మెమొరబుల్ సినిమా అని చెప్పచ్చు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌తో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా త్వరలో విడుదలవుతుంది. ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా నాకు మంచి గుర్తింపునిస్తుందన్న నమ్మకం వుంది. దాంతోపాటు మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమా చేస్తున్నాను. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కథ బాగా నచ్చింది. ప్రేమలో మూడు భిన్నమైన స్టేజీలను చూపించిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఈ సినిమాలో హీరో పాత్రలో ఉంటాయి. ఇందులో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాల్లో నటించాలని ఉంది అన్నారు.