రాష్ట్రీయం

అసమానతలను రూపుమాపేలా విద్యావిధానాలు ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: విద్యావిధానాలు దేశంలోని జనబాహుళ్యంలో అసమానతలను రూపుమాపేవిగా పేద, ధనిక అనే బేధాలు లేకుండా విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తూ వారిని ప్రోత్సహించేవిగా ఉండాలని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ప్రొఫెసర్ నళినీ జనేజా అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు జరుగుతున్న మహిళా ఉపాధ్యాయుల జాతీయ సమ్మేళనంలో ‘విద్య- సంస్కృతి’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం అనేక కమిషన్లు వేసిన ప్రభుత్వాలు ఏ కమిషన్ సిఫార్సులనూ పూర్తిగా అమలు చేయలేదని, ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలోనూ వారి వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా విద్యారంగం విధానాలు సైతం ప్రభావానికి గురవుతున్నాయని అన్నారు. 1996లో అప్పటి ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగంగా జైపాల్‌రెడ్డి, చిదంబరం, సీతారం ఏచూరి ఆధ్వర్యంలో విద్యను ప్రాథమిక హక్కుగా మార్చేందుకు రాజ్యాంగ సవరణకు సిఫార్సు చేయడం ఒక ముందడుగు అని అన్నారు. తదనంతరం రాజ్యాంగ సవరణ జరిగి విద్యా హక్కు చట్టం రూపొందిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం-2015 విద్యారంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందన్నారు. నేడు ప్రభుత్వ విద్యారంగంలో ఆంగ్ల మాధ్యమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అనివార్యంగా ముందుకొచ్చిందని, అసమానత్వం నుండి వచ్చిన కొంత మందికే నాణ్యమైన విద్య అనే భావనను సమాన అవకాశాల ద్వారా దూరం చేసే విధంగా విద్యా విధానం రూపొందాలని అన్నారు. ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి సీమా దత్త అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎస్.విజయగౌరి జాతీయ విద్యా విధానంపై ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ సి.బీనా మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ప్రవర్తన విద్యార్థుల వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందన్నారు. బోధనాంశాల్లో టీచర్లు పరిపూర్ణత్వం సాధించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌టిఎఫ్‌ఐ ఉపాధ్యక్షురాలు ఎం.సంయుక్త, కార్యదర్శులు శ్రీదేవి, చారులత, జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు అభిజిత్ ముఖర్జీ, సిఎన్.్భరతి , ఎ.నర్సిరెడ్డి, సిహెచ్.రవి, దుర్గ్భావాని, పి.మాణిక్‌రెడ్డి, కోశాధికారి ఎన్.కృష్ణయ్య, కార్యదర్శులు ఎన్.సరళ, బి.నర్సింహరావు, టి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.