నాన్‌స్టాప్ నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భలే భలే మగాడివోయ్’ చిత్రం విడుదలయ్యాక హీరో నాని జోరు పెంచాడు. గతంలో ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఆ ఒక్కటీ విడుదలకు నోచుకోక, చివరికి ఏదో విధంగా విడుదలై విజయవంతం కాకపోతే స్టార్‌డమ్ కాస్త పడిపోతుందన్న ముందుజాగ్రత్తతో ఇప్పుడు ఎడాపెడా చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇటీవలే ‘జై బాలయ్య’ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రారంభించిన చిత్రం సెట్స్‌పై వుంది. విరించివర్మ దర్శకత్వంలో రానున్న మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాశాడట. ఇక నాని చిత్రంకోసం ప్రేక్షకులు ఎదురుచూడవలసిన పని లేదు. సంవత్సరానికి మినిమమ్ నాలుగైదు చిత్రాలైనా అతనినుండి వచ్చే విధంగా సన్నాహాలు చేశాడు. ‘్భలేభలే మగాడివోయ్’ చిత్రంతో స్టార్‌గా ఎదిగిన నాని ఇకపై మాస్ చిత్రాల్లో కూడా నటిస్తాడన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే ఎప్పట్లాగే కథకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో నటిస్తానని అతడు చెబుతుండడం విశేషం!