రాష్ట్రీయం

సుప్రీంకోర్టులో తేలనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున గ్రీన్ ట్రిబ్యునల్‌లో జరుగుతున్న విచారణను నిరవధికంగా వాయిదా వేస్తామని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ అన్నారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 2నాటికి ట్రిబ్యునల్ వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ ప్రాజెక్టుపై సరైన అధ్యయనం చేయకుండానే పర్యావరణ అనుమతులను ఇచ్చారని రేలా అనే సంస్థ తరపు న్యాయవాది ట్రిబ్యునల్ ముందు వాదించారు. దీనిని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు సమర్థించారు.
సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కంటే మూడు రెట్లు ఎక్కువ పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు వాటిల్లుతోందని తెలంగాణ తరపు న్యాయవాది వాదించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రభావిత ప్రాంతాలలో గ్రామసభలు నిర్వహించకుండానే పర్యావరణ అనుమతులను ఇచ్చారని ట్రిబ్యునల్ ముందు రామచంద్రరావు వాదించారు. 2005లో మంజూరు చేసిన పర్యావరణ అనుమతులు ఇప్పుడు చెల్లవని ట్రిబ్యునల్‌కు వివరించారు. ఈ పర్యావరణ అనుమతులను మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ వాదించింది. ఏపి ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున దీనిపై విచారణను నిరవధికంగా వాయిదా వేస్తామని జస్టిస్ స్వతంత్రకుమార్ అన్నారు. ఏపి వాదనను పరిగణనలోకి తీసుకొని జనవరి 2న విచారణ జరుపుతామని ట్రిబ్యునల్ తెలిపింది.