రాష్ట్రీయం

ఆదిలాబాద్‌కు రైలుయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: తెలంగాణలోని ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు అంగీకరించినట్టు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, తెరాస ఎంపీ నగేష్ తెలిపారు. ఇద్దరు మంత్రులు, ఎంపీ మంగళవారం రైల్వే భవన్‌లో సురేష్ ప్రభును కలిసి ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణాన్ని కోరుతూ సిఎం కెసిఆర్ రాసిన లేఖను అందించారు. కెసిఆర్ ఈ అంశంపై సురేష్ ప్రభుతో టెలిఫోన్‌లో మాట్లాడినట్టు ఇద్దరు మంత్రులు చెప్పారు.
ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను ఫిబ్రవరి 1న ప్రతిపాదించే 2017-18 బడ్జెట్‌లో పొందుపరుస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు.
ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 132 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి వెయ్యి కోట్ల అంచనా వ్యయంలో సగం అంటే 500 కోట్లు భరించేందుకు రాష్ట్రం అంగీకారం తెలిపిందన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాదుకు మాత్రమే రైల్వే సౌకర్యం లేదని, అందుకే ఈ ప్రాంతానికీ సౌకర్యం కల్పించాలన్న పట్టుదలతో కెసిఆర్, ప్రాజెక్టులో సగం భరించేందుకు ముందుకొచ్చారని తెలిపారు.