ఆంధ్రప్రదేశ్‌

క్లినికల్ కోర్సుల్లో 380 సీట్ల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలల్లోని క్లినికల్ కోర్సుల్లో 380 సీట్లను పెంచడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు ఒక రోజు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జెపి నడ్డాతో భేటీ అయ్యారు. అనంతంరం కామినేని విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో ఏడు ప్రభుత్వం వైద్య కళాశాలల్లో క్లినికల్ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న 394 సీట్లకు అదనంగా మరో 380 సీట్లను పెంచాలని చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అంగీకరించినట్లు వెల్లడిచారు. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా తిరుపతిలో ఉన్న వైద్య కళాశాలలో 61 సీట్లు, కాకినాడ వైద్య కళాశాలలో 69 సీట్లు, కర్నూల్ కళాశాలలో84 సీట్లు, కాకినాడ కళాశాలలో94 సీట్లు, గుంటూరు కళాశాలలో 42 సీట్లు, విశాఖపట్నం వైద్య కళాశాలలో 94 సీట్లు, కడప వైద్యకళాశాలలో 16 సీట్లు పెరగనున్నట్టు వెల్లడించారు. ఏపీ విద్యార్ధులకు నీట్ పీజీ 2017లో అర్హత మార్కులు తగ్గించాలని, మినహాయింపులు కల్పించాలని చేసిన విజ్ఞప్తిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని నడ్డా చెప్పినట్లు కామినేని తెలిపారు. ఏపీలో కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా ప్రయత్నింస్తున్నామని వెల్లడించారు. అలాగే ఎంపీ టి.జి వెంకటేష్‌తో కసిసి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కామినేని భేటీ అయ్యారు. 2014లో గ్యాస్ పైప్‌లైన్ పేలడం కారణంగా గ్యాస్ ఆధారిత విఘ్నేశ్వరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి గ్యాస్ సరఫరాను నిలిపివేశారని, అయితే ప్రస్తుతం పైప్‌లైన్ పునరుద్ధరణ జరిగినందున యథావిధిగా గ్యాస్ సరఫరాను కొనసాగించాలని ప్రధాన్‌ను కోరినట్లు తెలిపారు.