ఆంధ్రప్రదేశ్‌

విదేశానికి వెళ్లిన రాహుల్ గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం విదేశానికి బయల్దేరారు. ఆరోగ్య పరీక్షల కోసం ఇప్పటికే విదేశంలో ఉన్న తన తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉండటంతో పాటు, తిరుగు ప్రయాణంలోనూ ఆమెతో ఉండటానికి రాహుల్ వెళ్లారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు చండీగఢ్‌కు వెళ్లిన రాహుల్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత విదేశానికి వెళ్లారు. సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం ఏ దేశానికి వెళ్లిన విషయం తెలియరాలేదు. పార్టీ వర్గాలు కూడా వెల్లడించలేదు. అయితే ఆమె గతంలో ఓ వ్యాధికి అమెరికాలో చికిత్స పొందినందున ఆరోగ్య పరీక్షల కోసం తిరిగి అక్కడికే వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాగాంధీ ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. ఓట్ల లెక్కింపుకన్నా ముందే ఈ నెల మొదట్లో ఆమె విదేశానికి వెళ్లారు.