రాష్ట్రీయం

తిరువనంతపురం-హౌరా, యశ్వంత్‌పూర్-వైష్ణోదేవి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తిరువనంతపురం-హౌరా, యశ్వంత్‌పూర్-వైష్ణోదేవి ఖత్ర మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం.06515 తిరువనంతపురం-హౌరా ప్రత్యేక రైలు తిరువనంతపురం నుంచి ఈనెల 17న మ.గం. 12:40లకు బయలుదేరి మరుసటి రోజు రా.గం. 10:55లకు హౌరా చేరుకుంటుంది. ఈప్రత్యేక రైలు చెన్నై సెంట్రల్, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. అదేవిధంగా ట్రైన్ నెం. 82651 యశ్వంత్‌పూర్ నుంచి వచ్చే నెల 1,14,21,28 తేదీల్లో ఉ.గం. 11:30లకు బయలు దేరి మరుసటి రోజు రా.గం. 20:25లకు వైష్ణోదేవి ఖత్ర చేరుకుంటుందని, ఈ రైలు తుంకూరు, అర్సికెరె, చిక్‌జజూర్, చిత్రదుర్గ, గుంతకల్లు, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాద్గిర్, కాజిపేట్, బల్లార్షా, నాగ్‌పూర్, హబీబ్‌గంజ్, ఝాన్సీ, న్యూఢిల్లీ, అంబాల, లూథియానా, జమ్ముతావి స్టేషన్లలో ఆగుతుందని పిఆర్‌వో ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.