రాష్ట్రీయం

కేంద్ర ఉద్యోగుల జీతాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా చూస్తున్న ఎదురుచూపులు ఇక ముగియనున్నాయి. వచ్చే నెల నుంచి కేంద్ర ఉద్యోగులందరికీ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా నాయకత్వంలో కొందరు కార్యదర్శుల బృందం జూన్ 11న సమావేశమై వేతన సంఘం సిఫార్సులకు తుది రూపాన్ని ఇవ్వనుంది. ఈ కమిటీ స్క్రీనింగ్ కమిటీలా వ్యవహరిస్తుంది. వేతన సంఘం సిఫార్సుల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా నేతృత్వంలో అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 47లక్షల మంది ఉద్యోగులు, 52లక్షల పెన్షనర్లు ఈ సిఫార్సుల ద్వారా లబ్ధి పొందనున్నారు. వేతనాల పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.1.02 లక్షల కోట్లు భారం పడుతుంది. ఇది స్థూల జాతీయ ఉత్పత్తిలో 0.7 శాతం.