ఆంధ్రప్రదేశ్‌

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూన్ 23: కర్నాటక రాష్ట్రం బళ్ళారి నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్‌శాఖ ఎఇగా పనిచేస్తున్న నాగరాజు(38) తన భార్య రత్నమ్మ(32), ఇద్దరు కూతుళ్లు పావని(6), ధనుశ్రీ(4)కు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం బళ్ళారి నగరంలోని బండిహట్టిలో నివాసముంటున్న నాగరాజు విద్యుత్‌శాఖ(జెస్కాం)లో ఎఇగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. బుధవారం రాత్రి భార్య రత్నమ్మ, పిల్లలు పావని, ధనుశ్రీకి విషమిచ్చిన నాగరాజు అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఇంట్లోనుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు తలుపుతీసి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కౌల్‌బజార్ ఎన్‌స్పెక్టర్ గోళిసంగి, పిఎస్‌ఐ వీరేశప్ప సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నాగరాజు రాసిన మరణవాంగ్మూలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పై అధికారుల వత్తిడి వల్ల సరిగా పని చేయలేకపోతున్నానని, అందుకు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నానని నాగరాజు అందులో రాసినట్లు తెలుస్తోంది. జిల్లా అదనపుఎస్పీ డిజయ్ డంబల్, నగర డివై ఎస్పీ హొసమనె సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.