క్రైమ్/లీగల్

అత్యాచార బాధితుల వివరాలు వెల్లడించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అత్యాచార బాధితులను సమాజం అంటరానివారిగా చూడడం పట్ల సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అత్యంత దురదృష్టరమని కోర్టు వ్యాఖ్యానించింది.‘లైంగిక దాడులకు, అత్యాచారానికి గురైన బాధితుల పేర్లు గోప్యంగా ఉంచాలి’అని న్యాయమూర్తి మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జాగ్రత్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బెంచ్ స్పష్టం చేసింది. ఎక్కడా బాధితురాలి పేరు, ఫొటోలు ప్రచురించవద్దని కోర్టు సూచించింది. అత్యాచారం, లైంగిక వేధింపుబాధితులు, మైనర్ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినా, దాన్ని బహిరంగ పరచొద్దని న్యాయమూర్తి ఆదేశించారు. ఇంతకు ముందు ఇదే పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పలు సూచనలు చేసింది. భావ స్వేచ్ఛపేరుతో బాధితుల హక్కులకు భంగం కలిగేలా మీడియా వ్యవహరించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అత్యాచారం కేసుల్లో సమ్యమనం పాటించాలని కోర్టు సూచించింది. కోర్టు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ మీడియా తీరుపై కోర్టుకు నివేదించారు. మీడియానే సమాంతర తీర్పును ఇచ్చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో మీడియా ఎలా వ్యవహరించాల్లో మార్గదర్శకాలు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు చార్జిషీట్‌కు ముందే కేసుకు సంబంధించి వివరాలు మీడియాకు ఉప్పందిస్తున్నారని ఇందిరాజైసింగ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువాలో మైనర్ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మీడియా అతిగా ప్రవర్తించిందని ఆమె గుర్తుచేశారు. విచారణపై రకరకాల వ్యాఖ్యానాలు చేయడం, నిందితులు అమాయకులని ఎలాంటి నేరానికి పాల్పడలేదంటూ ‘తీర్పు’లు ఇచ్చేసిందని ఆమె అన్నారు.