ఆంధ్రప్రదేశ్‌

అనాలోచిత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగం అంగీకరించక పోవచ్చునని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వాదించారు. బుధవారం రాజ్యసభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సిబల్ మాట్లాడుతూ మండల కమిషన్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలులేదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసిందని కపిల్ సిబల్ వాదించారు. తొమ్మిది మంది న్యాయమూర్తులు ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో మీరు ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి పది శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అనాలోచితంగా ఈ బిల్లును తెచ్చిందని ఆయన విమర్శించారు. ప్రముఖ న్యాయవాదులు కోర్టులో ఒక రకంగా వాదిస్తారు.. వారే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మరో రకంగా వాదిస్తారని అంటూ ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని పరోక్షంగా విమర్శించారు. దీనికి అధికార పక్షం స్పందిస్తూ మీరు కూడా అదేకోవకు చెందినవారా? అంటూ ప్రశ్నించటంతో సభలో ఉన్నవారంతా ఘొల్లుమన్నారు. ఉన్నత వర్గాలకు చెందినవారి ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉంటే వారు ఆర్థికంగా వెనుబడిన వారవుతారు కానీ దళిత, బడుగు, బలహీన వర్గాల వారు తమ వార్షిక ఆదాయం అరవై వేల రూపాయలున్నా ఆర్థికంగా వెనుకబడినవారు కారని ఈ బిల్లు చెబుతోందని కపిల్ సిబల్ వాదించారు. ఈ వాదనను అధికార పక్షం తీవ్రంగా ఖండించింది. ఎస్సీ రిజర్వేషన్లలో ఎలాంటి ఆర్థిక షరతులు లేవనేది కపిల్ సిబల్‌కు తెలియదా? అని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రశ్నించారు. కపిల్ సిబల్‌కు రిజర్వేషన్ల గురించి ఎలాంటి అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. పది శాతం రిజర్వేషన్లు కూడా పెద్దనోట్ల రద్దు మాదిరిగా గందరగోళం సృష్టిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయడం చాలా కష్టమని.. ఇదొక ఎన్నికల స్టంట్ తప్ప మరేమీ కాదని సిబల్ విమర్శించారు. లేని ఉద్యోగాలకు రిజర్వేషన్లు కల్పించి ఏం లాభమని ఆయన ఎద్దేవా చేశారు.

చిత్రం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్