క్రైమ్/లీగల్

గ్రామ న్యాయాలయాలపై జాప్యమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాలుగు వారాల్లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలని సుప్రీం కోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేలా రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని హైకోర్టులను కోరింది. న్యాయాన్ని ప్రజల ముంగిళ్లకు తీసుకెళ్లే లక్ష్యంతో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించిన చట్టాన్ని 2008లో పార్లమెంటు ఆమోదించింది. సామాజిక, ఆర్థిక, ఇతర అంశాల కారణంగా ఎవరికీ న్యాయ నిరాకరణ జరుగకూడదన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ మినహా ఎక్కడా అవి పనిచేయడం లేదన్న అంశాన్ని న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ గుజరాత్, హర్యానా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఇంతవరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదని సుప్రీం బెంచ్ తెలిపింది. ఈరోజు నుంచి వారంలోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని సదరు రాష్ట్రాలను ఆదేశిస్తున్నట్టు తెలిపింది. అలాగే ఇందుకు సంబంధించి లక్ష రూపాయల డిపాజిట్ కూడా ఉంచాలని స్పష్టం చేసింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, సభ్యుల నియామకం, పెండింగ్‌లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తులను ఈ ప్రక్రియ వేగవంతం చేయాల్సిందిగా సుప్రీం బెంచ్ కోరింది. ఇంతవరకు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేయని రాష్ట్రాలు నాలుగు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన కాపీలను అఫిడవిట్‌తో తమ పరిశీలనకు నివేదించాలని కోరింది. ఈ అంశం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.