రాష్ట్రీయం

నీట్ గరిష్ట వయోపరిమితిపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: నీట్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 25 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ ఎంసిఐ విధించిన నిబంధనలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచి ఈ మేరకు కేంద్రం, సిబిఎస్‌ఇ, కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. జనరల్ అభ్యర్థులకు 25, రిజర్వుడ్ అభ్యర్థులకు 30 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిగా నిర్ధారిస్తూ ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ 170 మంది చేసిన అభ్యర్థులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దానిని కోర్టు కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సోమవారం జరిగిన వాదనలలో 25 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి నిబంధన అన్యాయమని పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల ఓపెన్ స్కూళ్లలో చదివిన వారు, 11, 12 తరగతులు రెండు సంవత్సరాల కంటే ఎక్కువకాలం చదివినవారు, ప్రైవేట్‌గా చదివినవారు, బయాలజీ, బయోటెక్నాలజీ సబ్జెక్టులు చదివిన వారికి ఇబ్బంది అవుతుందని వాదించారు. దీనిని విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు వివరణ దాఖలు చేయాలని కేంద్రాన్ని, సిబిఎస్‌ఇ, కేరళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జూలై 10కి కేసును వాయిదావేసింది.