రాష్ట్రీయం

శశి థరూర్‌కుసమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన కేసులో, కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. జూలై 7న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ శశిథరూర్ ప్రేరేపించినట్టు పోలీసుల చార్జ్‌షీటు ఆధారంగా ప్రాసిక్యూటర్ చేసిన వాదనలు విన్న తర్వాత, ఆయన్ను ఈ కేసులో విచారించడానికి తగిన ఆధారాలున్నాయని స్పష్టమైందని అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ పేర్కొన్నారు. ఆయనపై ఐపీసీ 306, 498ఎ సెక్షన్ల కింద విచారణ జరుపవచ్చునని నిర్ధారించుకున్న తర్వాతనే జూలై 7న హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్టు కోర్టు పేర్కొంది. గత మే 28న కోర్టు ఈ కేసుకు సంబంధించి శశి థరూర్‌ను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేయాలా వద్దా అనే విషయంలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సునంద పుష్కర్‌ను, ఆమె భర్త శశిథరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించారని, గత మే 14న పోలీసులు ఆరోపించారు. ఇందుకు తగినన్ని సాక్ష్యాధారాలున్నాయని కూడా వారు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం మూడువేల పేజీల ఛార్జ్‌షీటును దాఖలు చేశారు. ఇందులో థరూర్‌ను ఒక్కడినే వారు నిందితుడిగా ఆరోపించారు. వీరి ఇంట్లో పనిచేసిన నారాయణ్ సింగ్‌ను ముఖ్యమైన సాక్షిగా పోలీసులు ఛార్జ్‌షీటులో పేర్కొన్నారు. 2014, జనవరం 17న ఒక లగ్జరీ హోటల్‌లో సునంద పుష్కర్ మరణించారు. 498ఎ కింద నేరం రుజువైతే నిందితుడికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అదే 306 సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల వరకు శిక్ష పడవచ్చు. సునంద పుష్కర్‌నను మానసిక, భౌతిక హింసకు గురిచేశారని ఛార్జ్‌షీటులో పోలీసులు ఆరోపించారు. అయితే ఇప్పటి వరకు థరూర్‌ను ఈ కేసులో అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.