క్రైమ్/లీగల్

పసిపాపపై అత్యాచారం, దోషికి మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 21: ఏడు నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడిన 19 ఏళ్ల కామాంధుడికి మరణ శిక్ష విధిస్తూ రాజస్తాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. 12 సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించే విధంగా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని రాజస్తాన్ అసెంబ్లీ ఈ ఏడాది ఆమోదించింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక కేసులో కోర్టు దోషికి మరణ శిక్షను ఖరారు చేసింది. దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం రేపిస్టులకు మరణ శిక్షను ఖరారు చేస్తూ గత ఏడాది డిసెంబర్‌లో చట్టం చేసింది. ఈ తరహా కఠిన చట్టాన్ని రూపొందించిన రెండవ రాష్ట్రం రాజస్తాన్ కావడం విశేషం. ఈ ఏడాది మే 9వ తేదీన ఒక పసికందును తీసుకెళ్లి నిందితుడు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పాపను సమీపంలోని ఫుట్‌బాల్ మైదానంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. వెంటనే పాపను అళ్వార్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ జరిగిన వైద్య పరీక్షల్లో పాపపై అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు విచారించిందని, 13 వాయిదాల్లో కేసు విచారణ పూర్తయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కులదీప్ జైన్ చెప్పారు.