రాష్ట్రీయం

పెరుగుతున్న భానుడి ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢల్లీ, మార్చి 29: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. కాగా ఈ ఏడాది వడగాడ్పులు ఏటాకంటే ముందుగానే దేశాన్ని కుదిపేస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఛండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ దాని శివారు ప్రాంతాల్లో ఇప్పటికే 2010 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడంతో, ఇక ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందోనని సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జమ్ము-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టల్ల్రోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం పోర్‌బందర్‌లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 41 డిగ్రీలతో సూరత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు చేరువగా ఉంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం నగరంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు, అధికార్లు మజ్జిగ ప్యాకెట్లు పంచడం కనిపించింది. వీటితో పాటు గ్లూకోజ్ బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు కూడా వీరికి పంపిణీ చేశారు. గతవారం ముంబయిలో గరిష్ణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ముంబయిలో మార్చి నెలలో రెండోసారి నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ముంబయిలో సాధారణ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్షియస్.