రాష్ట్రీయం

కరుణకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నివాళి * రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాట.. ఇద్దరు మృతి
చెన్నై, ఆగస్టు 8: మెరీనా బీచ్ జన సంద్రంగా మారింది. దివంగత మహానేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతిక కాయానికి ఇక్కడ మెరీనా బీచ్‌లో లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు జరిగాయి. ద్రవిడ పార్టీ సిద్ధాంతాల మేరకు కరుణానిధి భౌతిక కాయాన్ని ఖననం చేశారు. కరుణానిధి అభిమతం మేరకు రాజకీయ గురువు అన్నాదొరై సమాధి పక్కనే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మెరీనా బీచ్‌లోనే అంత్యక్రియలకు రాష్ట్రప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ కార్యక్రమం ఎటువంటి గందరగోళానికి తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. కాగా కరుణానిధి పార్థీవ దేహానికి రాజకీయపార్టీల నేతలు, వీఐపీలు, ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా రాజాజీ హాల్‌లో ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయ విజయన్, కేరళ గవర్నర్ పి సదాశివం, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, ఇంకా వివిధ పార్టీలకు చెందిన అతిరథ మహారథులు రాజాజీ హాల్‌కు వచ్చి నివాళులు అర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా హాల్ వెలుపల, చెన్నై నగరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మెహరించారు. కరుణానిధి భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎగసిపడుతున్న తరంగంలో వస్తున్న జనాన్ని నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. దివంగత నేత కరుణానిధి భౌతికకాయానికి జాతీయపతాకాన్ని కప్పి గ్లాస్‌తో రూపొందించిన శవపేటికలో ఉంచారు. కాగా అంతకు ముందు మెరీనాబీచ్‌లో కరుణానిధి భౌతిక కాయానికి అంత్యక్రియలపై ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు హైకోర్టులో ఈ అంశంపై ప్రభుత్వం, డీఎంకే న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి. ముఖ్యమంత్రిగా మరణించిన వారికే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతి ఉందని ప్రభుత్వం పేర్కొంది. కాగా అటువంటి చట్టమేమీ లేదని డీఎంకే న్యాయవాది కోర్టుకు చెప్పారు. ద్రవిడ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదొరై సమాధి పక్కన కరుణానిధికి స్థానం కల్పించకపోవడం అవమానమని ఆయన కోర్టుకు తెలిపారు. ద్రవిడ ఉద్యమం కోసం జీవితాంతం పోరాడిన కరుణానిధికి గాంధీ మండపం వద్ద రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుత్వం తెలియచేయడంపై డీఎంకే న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అనంతరం మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. మెరీనాబీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రాజాజీహాల్ వెలుపల ఉన్న లక్షలాది మంది ప్రజలు, అభిమానులు స్వాగతించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రతిపక్ష నేత స్టాలిన్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా కరుణానిధి మృతికిసంతాప సూచకంగా పార్లమెంటు, రాష్టప్రతి భవనాలపైన ఉన్న జాతీయ పతకాలను అవనతం చేశారు.

స్వచ్ఛందంగా బంద్!
కరుణానిధి మృతితో రాష్టమ్రంతా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు. రోడ్లన్నీ బోసిపోయాయి. ఎక్కడికక్కడ వర్తకులు, సిబ్బంది దుకాణాలు మూసివేసి మెరీనాబీచ్‌కు తరలి వెళ్లారు. తమ నేత భౌతిక దేహాన్ని కడసారి చూసేందుకు అనుమతివ్వాలని ప్రజలు తోసుకురావడంతో పోలీసులు సంయమనంతో వారిని చెదరగొట్టారు. కరుణానిధి మృతికి సంతాప సూచకంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఒక రోజు సెలవు ప్రకటించింది. కరుణానిధినికి నివాళులు అర్పించేందుకు వచ్చిన తమిళ రచయిత వైరముత్తు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెరియార్ ఇవీ రామస్వామి మరణించినప్పుడు కరుణానిధి రాసిన కవితను చదివారు. ‘ తాజ్ మహల్ కట్టడం పాతదైందని కూల్చడానికి అంగీకరిస్తామా అని కరుణా నిధి రాసిన అద్భుతమైన కవితను ఆలపించారు.