రాష్ట్రీయం

లోన్ రీషెడ్యూలింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 22: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన కేరళలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. కాగా, రాష్ట్రంలో అన్ని లోన్లను రీషెడ్యూలింగ్ చేయడం ద్వారా ప్రజలకు ఊరట కల్పించాలని బ్యాంకులు నిర్ణయించాయ. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది. రుణాలపై వడ్డీని రద్దు చేయాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. అదే విధంగా తాజాగా కొత్త చెక్కుబుక్కులను జారీ చేయడానికి ఫీజును వసూలు చేయరాదని నిర్ణయించింది. విద్యా రుణాల అసలు లేదా వడ్డీపై ఆరు నెలల మారటోరియం విధించింది. తద్వారా విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. కమిటీ తీర్మానాలను కెనరా బ్యాంక్ చైర్మన్ టీఎన్ మనోహరన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/ ఎస్‌ఎల్‌బీసీ చైర్‌పర్సన్ పీవీ భారతి బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు.
వరదలతో రాష్ట్రం అతలాకుతలమైందని, అందుకే, ఆరు నెలల పాటు ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయకూడదని కమిటీ తీర్మానించిందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా బ్యాంకులు సేవలను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. అక్కడ జరిగే లావాదేవీలపై ఎలాంటి రుసుము ఉండబోదని స్పష్టం చేశారు. కొన్ని సేవలపై అక్టోబర్ 31వ తేదీ వరకూ ఫీజును వసూలు చేయడం లేదన్నారు.
మొత్తం 323 బ్రాంచీలు, 423 ఏటీఎంలు వరద నీటిలో మునిగిపోయినట్టు చెప్పారు. తీవ్రంగా దెబ్బతిన్న బ్రాంచీల్లో 162 బ్రాంచీలు సేవలను ఆరంభించాయని చెప్పారు.

విరాళాలపై పన్ను ఎత్తివేత
న్యూఢిల్లీ: కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రధాన మంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన విరాళాలపై ఐటీ శాఖ పన్నుని ఎత్తివేసింది. ఈ నిధికి ఎంత మొత్తం ఇచ్చినా, దానికి ఎలాంటి పన్ను వర్తించదని ఐటీ శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా లబ్ధిదారులకు పన్నులో 50 శాతం రిబేట్ ఇస్తున్నట్టు పేర్కొంది. వ్యక్తులకేగాక, ట్రస్టులు, ఎన్‌జీవోలు, ఫౌండేషన్లు, ఇతర సంస్థలకు కూడా ఈ పన్ను రాయితీ వర్తిస్తుందని వివరించింది.