క్రైమ్/లీగల్

మేజర్ గొగాయ్‌పై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/శ్రీనగర్, ఆగస్టు 27: కాశ్మీరీ యువతిని హోటల్‌కు తీసుకెళ్లిన ఘటనలో దోషిగా తేలడంతో మేజర్ లీతుల్ గొగాయ్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆర్మీ కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార వర్గాలు సోమవారం ధృవీకరించాయి. విధి నిర్వహణలో ఉంటూనే గొగాయ్ మే 23న స్థానిక 18 ఏళ్ల యువతిని తీసుకుని సుదూరంలోని హొటల్‌కు వెళ్లాడు. అయితే, సదరు యువతి స్థానికురాలు కావడంతో హొటల్ సిబ్బంది వారిని గదిలోకి అనుమతించలేదు. దీంతో మేజర్ గొగాయ్ వారితో గొడవకు దిగాడు. ఈ విషయమై హొటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలోనూ మేజర్ గొగాయ్ వివాదాస్పద వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కాడు. గత ఏడాది ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా కాశ్మీర్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమం నుంచి తప్పించుకునే క్రమంలో స్థానిక ఒక యువకుడిని తన వాహనానికి కట్టి ఈడ్చుకుంటూ వెళ్లిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. మేజర్ గొగాయ్ చర్యలను మిలటరీ వర్గాలు సైతం సమర్ధించాయి. అయితే, మొదటినుంచీ వివాదాస్పదుడిగా ముద్ర పడిన గొగాయ్ తాజాగా ఈ ఏడాది మేలో కాశ్మీరీ యువతిని హొటల్‌కు తీసుకెళ్లిన సంఘటన ఆధారాలతో సహా రుజువు కావడంతో విచారణ జరిపిన ఆర్మీ కోర్టు అతనిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు.