ఆంధ్రప్రదేశ్‌

నిధులు పెరిగినా విద్యారంగానికి కొరతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ సంస్థలపై అస్పష్టత
హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి నిధులు భారీగానే పెరిగినా అవసరాలు చూస్తుంటే కొరత తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న జాతీయ విద్యాసంస్థలకు సంబంధించి రాష్ట్రం పెద్దగా కేటాయింపులు చేయకపోవడంతో అవసరాలకు కేంద్రం నిధులపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్‌లో పాఠశాల విద్యకు 17502 కోట్లు, ఉన్నత విద్యకు 2644.64 కోట్లు వ్యయం చూపించారు. ఉన్నత విద్యారంగానికి చెందిన ఏడు సంస్థలకు భారత ప్రభుత్వం నుండి అనుమతి సాధించడంలో ప్రభుత్వం ఎంతో చొరవ చూపించింది. సెంట్రల్ యూనివర్శిటీ , గిరిజన వర్శిటీలు ఏర్పాటుకు కేంద్రం అనుమతించనున్న తరుణంలో అందుకు సంబంధించి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం దృష్టిసారించినట్టు లేదు. మొత్తం మీద చూస్తే విద్యకు కేవలం 14.84 శాతం మాత్రమే కేటాయించినట్టయిందని, తద్వారా అధికార పార్టీ ఊదగొట్టే ఉపన్యాసాలే తప్ప నిధుల కేటాయింపుల్లో మాత్రం మోసం చేసిందని భారత విద్యార్ధి ఫెడరేషన్ అధ్యక్షుడు వై రాము, కార్యదర్శి ఎస్ నూర్‌మహమ్మద్ పేర్కొన్నారు. అరకొర నిధులతో అక్షరాస్యత సాధించడం అసాధ్యమని, ప్రభుత్వ విద్యను నాశనం చేయడానికే విద్యారంగానికి నిధులు తగ్గించారని వారు ఆరోపించారు. దేశంలో విద్యా హక్కు అమలు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని, దేశంలో సగటు అక్షరాస్యత 74 శాతం ఉంటే ఆంధ్రాలో ఇప్పటికీ అక్షరాస్యత 67 శాతం వద్ద ఉందని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సరిపడా నిధులు కేటాయించలేదని, తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్ధుల విషయం కూడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.