రాష్ట్రీయం

సీనియారిటీ ప్రకారం హోంగార్డుల సర్వీసుల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోంమంత్రి నాయిని
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డుల అందరి సర్వీసులు ఒకేసారి క్రమబద్ధీకరించడం కుదరదని దశలవారీగా సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేసారు. హోంగార్డుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సును నాయిని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. హోంగార్డుల సమస్యలపై సిఎంతో మాట్లాడి న్యాయం చేస్తామనీ, గొంతెమ్మ కోర్కెలన్నీ పరిశీలించడం కష్టతరమైనదని అన్నారు. ఇటీవల ఐజిలతో కలిసి సిఎం. కెసిఆర్ సమస్యలను చర్చించామన్నారు. ఒక హోంగార్డ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, హోంగార్డులను పోలీసులుగా పరిగణించడం కుదరదని మంత్రి అన్నారు. సిఎం సహృదయంతో వారికి న్యాయం చేస్తారని, పోలీసు సెలక్షన్ ప్రకారం హోంగార్డుల సెలక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి మీ సర్వీసులకు భయమవసరం లేదు కానీ సీనియారిటీ ప్రకారం అవకాశం కోసం వేచి వుండాలని, యూనిఫామ్ కోసం రూ.2వేలు ఇస్తామని నాయిని ప్రకటించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఎంబ్లమ్‌లో వున్న కనపడని నాల్గవ సింహమే హోంగార్డ్ అన్నారు. వారి సంక్షేమానికి చట్టంలో మార్పులు చేయాలని సిఎంకు సూచిస్తామన్నారు. పేదలకిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లలో అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తానని గౌడ్ అన్నారు. తొలుత సంఘం అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ, తమ కోర్కెల అజెండాను హోంమంత్రికి సమర్పించా మన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జిల్లాల సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ట్రెజరర్ హరిబాబు పాల్గొన్నారు.