ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీలన్నీ నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంపై తీవ్ర చర్చ జరిగినప్పుడు కేంద్రం ఈమేరకు స్పందించింది.

లోక్‌సభలో..
విభజన చట్టం అమలులో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, ఏపీకి ఇచ్చిన హామీలను పట్టించుకోవడంలేదని విపక్ష కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. దీనిపై జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన రెండోరోజే పోలవరంపై ఆర్డినెన్స్ తెచ్చామని, పలు విద్యాసంస్థలు ప్రారంభించామని, గడువులోగా పోలవరం పూర్తి చేయాలని కృతనిశ్ఛయంతో ఉన్నామని అన్నారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై యుపిఎ ప్రభుత్వం ఒక్కమాటకూడా రాయలేదని, రాజకీయంకోసం ఇప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, ఇది మంచి సంప్రదాయం కాదని వెంకయ్య తేల్చి చెప్పారు.
రాజ్యసభలో...
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని కేంద్రం పట్టించుకోవడం లేదని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో చేసిన విమర్శలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి దీటైన సమాధానం ఇచ్చారు. ఎన్‌డీఎ ప్రభుత్వం ఇంతవరకూ ఏపీకి ఏం చేసిందీ వివరించారు. కాంగ్రెస్ ఎంపీలు కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు కొద్దిసేపు ఈ విషయంపై ఆందోళనకు దిగారు. రాజ్యాంగాన్ని మార్చి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ఇది రాజ్యసభ ప్రతిష్టకు సంబంధించిన అంశమని కేవీపి అన్నారు. కాగా ఆజాద్ విమర్శలపై టిడిపి ఎంపి సిఎం రమేష్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండేళ్లకు తప్పుచేసినట్లు కాంగ్రెస్ అంగీకరించిందని ఆజాద్ ప్రకటన తేటతెల్లం చేస్తోందని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరని, అందుకే ఒక్కచోటకూడా డిపాజిట్ దక్కకుండా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడుకూడా రాజకీయ లబ్దికోసమే ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.