నీలకంఠ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుని క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అంజలి ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’, లేడీ ఓరియెంటెడ్ ‘చిత్రాంగద’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత అంజలి మరో సినిమాకు ఓకె చెప్పిందట. అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. అప్పట్లో ‘మిస్సమ్మ’ సినిమాతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీలకంఠ కొంత గ్యాప్ తరువాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని, వైవిధ్యమైన కథ, కథనంతో తెరకెక్కే ఈ సినిమాలోని పాత్రకు అంజలి అయితే కరెక్టు అని ఆమెను సంప్రదించాడట. కథ నచ్చడంతో అంజలి కూడా ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.