రాష్ట్రీయం

జలం.. ప్రగతికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్క ఎకరాకూ నీరందిస్తాం
రాష్టవ్య్రాప్తంగా పంట సంజీవిని
సీమను రతనాలసీమగా మారుస్తాం
నీరు- ప్రగతి సదస్సులో సిఎం చంద్రబాబు

అనంతపురం, డిసెంబర్ 24: నీరు ప్రగతికి చిహ్నమని, అంతటి విలువైన నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చుకుందామని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నీరెక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన నీరు- ప్రగతి రాష్టస్థ్రాయి సదస్సులో సిఎం మాట్లాడారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించే నీరు- చెట్టు పథకంలో పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇదిపూర్తిగా ప్రజాహిత కార్యక్రమమని, ఏడాది తరువాత దీని ఫలితాలు వస్తాయన్నారు. ఇప్పటికే రాష్ట్భ్రావృద్ధి, సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టామని, అయితే జీవితంలో పూర్తి సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఇదేనన్నారు. జిల్లాలో నెలకొన్న కరవుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారన్నారు. తాను సిఎం అయ్యాక వెలిగొండ, తోటపల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానన్నారు. వీటన్నింటినీ పూర్తిచేసి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్రంలో ఇబ్బందులున్నాయని, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేయాల్సి ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన నీరు- చెట్టు కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. చిత్తూరు జిల్లాలో 33 మి.మీ సరాసరి ఉన్న భూగర్భజలం 19 మి.మీ పెరగడం శుభపరిణామమన్నారు. ఇది కేవలం నీరు- చెట్టు ద్వారా పెరిగిన భూగర్భజలాలు మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వర్షపునీటిని పూర్తిగా భూగర్భజలంగా మార్చుకోవాలని, తద్వారా కరవును చూసి భయపడే పరిస్థితిపోయి మనలను చూసి కరవుభయపడే పరిస్థితి వస్తుందన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పొలంలో పంట సంజీవిని పేర ఫారం పాండ్స్ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వీటిని అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామన్నారు. వీటితో వర్షపునీటిని భూగర్భజలంగా మార్చుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఒక మీటరు వర్షపు నీటిని నిలుపుకుంటే భూమిలో 90 టిఎంసిల భూగర్భజలాన్ని నిల్వ చేసుకున్నట్ట అవుతుందన్నారు. రాష్ట్రంలో 940 మిమీ వర్షం కురిస్తే సుమారుగా ఐదువేల టిఎంసిల భూగర్భజలాన్ని నిల్వ చేసుకున్నట్ట అవుతుందన్నారు. అందుకే నదుల అనుసంధానం చేపట్టామన్నారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా నదుల అనుసంధాన కార్యక్రమానికి నాంది పలికామన్నారు. పట్టిసీమ ద్వారా 80 టిఎంసిలు, వాగులు, వంకల ద్వారా 20 టియంసిల నీటిని కృష్ణా నదిలో మిగిలేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు మళ్లించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఇలా శ్రీశైలం ద్వారా వచ్చే కృష్ణా నీటితో జిల్లాలోని ప్రతి చెరువునూ నింపుతామన్నారు. రాష్టవ్య్రాప్తంగా డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దీంతోపాటు ప్రతి పొలంలో పంట సంజీవిని పథకం కింద ఫారం పాండ్ నిర్మించుకుని మొబైల్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి పంటలు ఎండిపోకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో 737 వాటర్ బేసిన్‌లు ఉన్నాయని, రాష్టవ్య్రాప్తంగా 1250 కొత్త ఫీజో మీటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. తద్వారా రాష్ట్రంలోని వాటర్ బేసిన్ల పరిధిలో ఎక్కడ ఎంతమేరకు భూగర్భజలం పెరిగిందన్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయన్నారు. ఇందుకు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. రాష్ట్రంలో పది లక్షల ఫారం పాండ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చి అనంతపురం జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని సిఎం అన్నారు. రాష్ట్రంలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఎవరికి అవసరమైనా ఇస్తామని చెప్పారు. పొలం పిలుస్తోంది, భూసార పరీక్షలు, మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశామని, 43 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. సీమను కరవుకోరల నుంచి రక్షించడానికి అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీ బాల తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) నీరు- ప్రగతి పైలాన్ ఆవిష్కరిస్తున్న సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, మంత్రులు