నెగెటివ్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు భాషల్లో గ్లామర్ తారగా, టాప్‌రేంజ్‌లో వెలుగొందుతోంది అందాల భామ కాజల్. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న కాజల్, పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు తమిళ్‌లో సూర్య, విక్రమ్‌ల సరసన నటిస్తున్న ఈమె ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న కాజల్ ఇప్పుడు నటిగా పేరుతెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. తమిళ్‌లో విక్రమ్ హీరోగా రూపొందే ‘మర్మమణిదన్’ సినిమాలో నెగెటివ్ టచ్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తోందట. అయితే కాజల్ విక్రమ్‌ల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అనే స్థాయిలో ఉంటాయట. ఈ సినిమాతో నటిగా కూడా మంచి మార్కులు కొట్టేస్తాననే గట్టి నమ్మకంతో ఉంది ఈ భామ.