పోస్ట్ ప్రొడక్షన్‌లో వల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేహ, రజత్‌కృష్ణన్, అరహాన్, రాజీవ్‌కనకాల ప్రధాన పాత్రల్లో ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘వల్లి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ మానవాళి అభివృద్ధికోసం మనస్సుని పరిశోధించే యంత్రాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్న ఒక ప్రొఫెసర్, వైజ్ఞానిక పరిశోధనలకు డబ్బు ఆటంకం కాకూడదని, తన యావదాస్తిని దానంచేసే సైంటిస్టు, తన కూతురి ఆశయాన్ని నెరవేర్చేందుకు తపనపడే తండ్రి వంటి విభిన్న పాత్రలతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో పూర్వజన్మ స్మృతులు కూడా కనిపిస్తాయి. పూర్వజన్మలో వల్లి లైలా అన్న విషయం తెలుసుకుంటుంది. ఆమె ప్రియుడు మజ్ను కలిశాడా లేదా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్నేహితుడి ప్రేమను అందుకుంటుందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన సినిమా ఇది. రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది అన్నారు. నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్‌తో మా మొదటి సినిమా చేయడం అదృష్టంగా వుంది. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ** నేహ **