27న నేను నా ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేఖర్, సుష్మ జంటగా వరదన్ దర్శకత్వంలో దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పణుకు రమేష్‌బాబు, వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నేను నా ప్రేమకథ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు వరదన్ మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి ప్రేమకథే ఈ చిత్రమని, ఇప్పటివరకు చాలారకాల ప్రేమకథలు వచ్చినా ఇది ఈ చిత్రం మాత్రం భిన్నంగా వుంటుందని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈనెల 27న విడుదల చేస్తున్నామన్నారు. నిర్మాత పణుకు రమేష్ మాట్లాడుతూ, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తమ బ్యానర్‌కిది మొదటి సినిమా అని, తప్పకుండా అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నానన్నారు. హీరో శేఖర్ మాట్లాడుతూ, ఇది తన మొదటి చిత్రమని, కొత్త పాయింట్‌తో ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా వుంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:చిన్నిచరణ్, మితిన్.ఎం.ఎస్., కెమెరా:నగేష్ ఆచార్య, నిర్మాతలు:వర్మ, పణుకు రమేష్‌బాబు, దర్శకత్వం:వరదన్.