ఆంధ్రప్రదేశ్‌

రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసిన ఘనత తమదే అని , చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తమపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ధర్మవరంలో శనివారం చేనేత రుణవిముక్తి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే చేనేత కార్మికులకు రూ.36కోట్ల రుణవిముక్తి చేశామని సీఎం తెలిపారు. వ్యవసాయం తర్వాత చేనేత పైనే ఎక్కువ ఆధారపడుతున్నారన్నారు. చేనేత కార్మికులకు సబ్సిడీ కోసం రూ.50కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. చేనేత భవన్లు, నేత బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత కార్మికులు అభివృద్ధి చెందేవరకు అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు ఆధునిక పనిముట్లు ఇప్పిస్తామన్నారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాను నెంబర్‌వన్‌ జిల్లాగా చేస్తామన్నారు. అనంతపురం వేరుశనగకు డిమాండ్‌ ఎక్కువ ఉందని, వేరుశనగ మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని బాబు తెలిపారు.