రాష్ట్రీయం

గోదావరిపై మరో రైలు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రిలో ప్రత్యేక కార్యాలయం

రాజమండ్రి, డిసెంబర్ 21: ఉభయ గోదావరి జిల్లాలను కలిపే రాజమండ్రి-కొవ్వూరు మధ్య మరో రైలు మార్గం ఏర్పాటుచేయడానికి రైల్వే శాఖ సన్నాహాలు ప్రారంభించింది. రైలు మార్గం నిర్మాణంలో భాగంగా రాజమండ్రిలో రైల్వేశాఖకు చెందిన చిత్రాంగి అతిధిగృహం వద్ద ప్రత్యేక కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు చేపట్టారు. గోదావరిపై రైళ్ల రాకపోకల నిమిత్తం బ్రిటీష్ కాలంలో పాత రైలు వంతెన (హేవలాక్) నిర్మించారు. ఆ తరువాత రోడ్డుకంరైలు వంతెన, ఆర్చ్‌లతో కూడిన బౌస్ట్రింగ్ వంతెన నిర్మించారు. హావలాక్ వంతెన చాలాకాలం క్రితమే శిథిలావస్థకు చేరి మూతపడింది. ప్రస్తుతం గోదావరి నదిపై రెండు ట్రాక్‌లు మాత్రమే ఉండటంతో రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఈకారణంగా చెన్నై-హౌరా ప్రధాన మార్గంలోని రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో గోదావరిపై మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కొద్ది నెలల క్రితం గోదావరిపై నిర్మించిన బౌస్ట్రింగ్ వంతెన దెబ్బతినడంతో రైళ్ల రాకపోకల్లో జాప్యం ఏర్పడింది. కొవ్వూరు వైపు నుంచి 7వ ఆర్చ్ వద్ద వంతెనను పటిష్టం చేసే ఒక స్తంభం దెబ్బతింది. దీంతో ఈవంతెనపై సుమారు ఐదు నెలల పాటు రైళ్ల వేగాన్ని 30 కిలోమీటర్లకు నియంత్రించారు. సుమారు 20రోజుల క్రితం దెబ్బతిన్న స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ. కోటి విలువైన ఈస్తంభాన్ని స్విట్జర్లాండ్ నుంచి తెప్పించి అమర్చారు. నిపుణులు వంతెనను పరీక్షించి గంటకు 80కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ ఏర్పడకుండా బౌస్ట్రింగ్ వంతెనపై మరో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల రాజమండ్రికి వచ్చిన విజయవాడ డిఆర్‌ఎం కూడా వంతెనను పరిశీలించి, రైల్వేబోర్డుకు నివేదించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బౌస్ట్రింగ్ వంతెన పక్కనే రైల్వే ట్రాక్‌కు స్థలాన్ని కేటాయించారు. వంతెనను కూడా దాని ప్రకారమే డిజైన్ చేశారు. రైలు మార్గాన్ని నిర్మించే చర్యల్లో భాగంగా రైల్వేకు చెందిన చిత్రాంగి అతిధిగృహంలో ప్రత్యేక కార్యాలయం నిర్మిస్తున్నారు. కాగా, చెన్నై-హౌరా మార్గంలోని రాజమండ్రిలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని 4,5 ప్లాట్‌ఫారాల నిర్మాణానికి కూడా రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత సెప్టెంబర్‌లో అధికారులు, నిపుణుల కమిటీతో కూడిన బృందం స్టేషన్‌ను పరిశీలించి, మాస్టర్ ప్లాన్‌ను కూడా రూపొందించినట్లు సమాచారం. మంగళవారం రాజమండ్రికి రానున్న దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్రగుప్తా ఈఅంశాలపై సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కీలకమైన రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో ఆరు ప్రధాన రైళ్లకు స్టాపు లేకపోవడం పట్ల ప్రయాణీకులు, ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై కూడా జిఎం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.