ఆంధ్రప్రదేశ్‌

హోదా కంటే ఎక్కువే చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగు దేశం పార్టీ అనవసరంగా రాజకీయం చేస్తున్నదని బిజెపి ఎపి రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువే ఇస్తున్నదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూస్తున్నదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రభృతులు ప్రత్యేక దృష్టి సారించారని ఆయన చెప్పారు. అయినా తెలుగు దేశం పార్టీ మిగతా ప్రతిపక్షాలతో కలిపి రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు.
ఏపీలో ఒకే గొడుగు కిందకు
గిరిజన పాఠశాలలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సొసైటీల ఆధీనంలో ఉన్న గిరిజన పాఠశాలలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 93ని జారీ చేసింది. గతంలో గిరిజన పాఠశాలలు ఐటిడిఎల ఆధీనంలో ఉండేవి. తర్వాత కొంతకాలానికి వాటిని ప్రభుత్వ పాఠశాల విద్య ఆధీనంలోకి తెచ్చారు. పరిపాలనా పరమైన అధికారం మాత్రం ఐటిడిఎలకు ఉంచి, మిగిలిన అన్ని అంశాలనూ పాఠశాల విద్య పర్యవేక్షించేది. ఇందుకోసం ఏజన్సీ డిఇఓలను, డిప్యూటీ డిఇఓలను నియమించింది. తర్వాత ఎస్టీల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆశ్రమ పాఠశాలలను, గురుకులాలను పర్యవేక్షించేందుకు వేర్వేరుగా రెండు సొసైటీలను ఏర్పాటు చేశారు. రెండు సొసైటీలు పనిచేయడంతో ఉద్యోగుల నియమనిబంధనలు, జీత భత్యాలు, హోదా, విద్యాత్మక అంశాల్లో విపరీతమైన వ్యత్యాసాలు ఉండటం రెండు సొసైటీల మధ్య సమన్వయానికి ఇబ్బందిగా మారింది. గత మార్చిలో జరిగిన సమగ్ర సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి పలువురు ప్రజాప్రతినిధులు, సొసైటీ అధికారులు ఈ అంశాన్ని తీసుకురావడంతో గిరిజన పాఠశాలలు అన్నింటినీ ఒకే సొసైటీ పరిధిలోకి తీసుకురావాలని సిఎం ఆదేశించారు. దాంతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.