ఆంధ్రప్రదేశ్‌

గోమాంసం తరలిస్తున్న వాహనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 13: గోవుమాంసాన్ని ప్రత్యేక వాహనంలో స్థానిక చినరావూరుతోట వైపు తరలిస్తున్న సమయంలో ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ సభ్యులు వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్, వాహనంలో ఉన్న మాసంతోసహా పోలీసులకు అప్పగించిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ ఇన్‌చార్జ్ సిఐ అశోక్‌కుమార్ , ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ సభ్యుల కథనం ప్రకారం గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గోవు మాంసాన్ని గుంటూరు వైపునుండి తెనాలి చినరావూరు ఈద్గావద్దకు తరలిస్తున్నారంటూ ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు తెనాలిలోకి వచ్చే వివిధ రహదార్లపై కాపుకాశారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేయగా గోవు మాంసం కనిపించింది. వెంటనే వారు డ్రైవర్ సహా వాహనాన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జ్ సిఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో సంఘటన వద్దకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ముస్లింలు, హిందువులు పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ హిందూ, ముస్లింలు సంయమనం పాటించాలని కోరారు.