రాష్ట్రీయం

నాలుగేళ్లలో 50 కోట్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, సెప్టెంబర్ 15: అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు లభ్యమవుతుండడం, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తూ ఉండడంతో భారత్ ఆన్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ భాషల విభాగం చీఫ్ రిచాసింగ్ చిత్రాంశి చెప్పారు.
2020 నాటికి భారత దేశ ఆన్‌లైన్ జనాభా 50 కోట్లకు చేరుకుంటుందని, వారిలో చాలామంది స్థానిక భాషను ఉపయోగించే వారే ఉంటారని బుధవారం ఇక్కడి రాజీవ్ గాంధీ ప్రోయోగికి విశ్వవిద్యాలయంలో ఐటి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఆమె చెప్పారు. విశ్వ విద్యాలయం, ఎంపి పోస్ట్ అనే ఆన్‌లైన్ పోర్టల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
ఇంటర్నెట్ గతం, ప్రస్తుత స్థితి గురించి మాట్లాడుతూ, తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాకేజిలు లభించడం కోట్లాది మంది భారతీయులు ఆన్‌లైన్‌కు అలవాటు పడడానికి ప్రధాన కారణమని చిత్రాంశి చెప్పారు. ఇప్పుడు భారత్‌లో 65 శాతం మంది తమ స్మార్ట్ ఫోన్లద్వారానే ఇంటర్నెట్‌ను వెతుకుతున్నారని, కొత్తగా ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ఫోన్లద్వారానే ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందుతున్నారన్నారు. ఆసక్తికకరమైన విషయమేమిటంటే వాళ్లంతా ఇంగ్లీషును ఉపయోగించే వారు కాదని ఆమె చెప్పారు.
ఇంటర్నెట్‌ను ఉపయోగించే 35 కోట్ల మందిలో 15 కోట్ల మంది స్థానిక భాష తెలిసిన వారేనని, దేశంలో ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారిలో మెజారిటీ సంఖ్య వారిదేనని ఆమె చెప్పారు.
దేశంలో ఇంటర్నెట్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయని చిత్రాంశి చెప్తూ 2020 నాటికి నెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య ఇప్పుడున్న 43 శాతంనుంచి 62 శాతానికి చేరుకుంటుందన్నారు. గత ఏడాదిన్నర కాలంలో స్థానిక భాషలో ప్రశ్నలు 10 రెట్లు పెరిగినట్లు గూగుల్ గుర్తించిందని కూడా ఆమె చెప్పారు. అందులో ముఖ్యంగా హిందీలో సమాచారాన్ని తీసుకునే వారు అయిదు రెట్లు పెరుగుతున్నారని ఆమె చెప్పారు. సమాచారం, వేగం, ప్రాడక్ట్‌లే తమ కంపెనీ ప్రాధాన్యతలని కూడా ఆమె చెప్పారు. ఆండ్రాయిడ్‌పై పని చేసే గూగుల్‌కు చెందిన ఇండిక్ కీ బోర్డును కోటి సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆమె తెలిపారు.
భారత్‌లో 22 అధికార భాషలుండగా వాటిలో 11 భాషలను గూగుల్ సపోర్ట్ చేస్తోంది. గూగుల్ సపోర్ట్ చేస్తున్న భాషల్లో హిందీ, బెంగాలీ తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం లాంటి ప్రధాన భాషలున్నాయి. ఎంపి పోస్ట్ వ్యవస్థాపక సంపాదగకుడు సర్మాన్ నగేలె, మధ్యప్రదేశ్ రోజ్‌గార్ ఔర్ నిర్మాణ్ ఎడిటర్ పుష్పేంద్ర పాల్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.