రాష్ట్రీయం

విదేశీ విద్యకు రూ.20లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బిసి విద్యార్థులకు ప్రభుత్వం 20లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి ఓవర్‌సీస్ విద్యానిధి పథకం మార్గదర్శకాలను మంగళవారం జారీ చేశారు. 20 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ను రెండు విడతలుగా చెల్లిస్తారు. 30ఏళ్ల లోపు ఉన్న బిసి విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు లక్షా 50వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాల వారికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కోసం ఈ సహాయం అందజేస్తారు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్‌సైన్స్, హ్యుమానిటీస్ కోర్సులు చదివే వారు ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధిపొందే అవకాశం ఉంది.