ఆంధ్రప్రదేశ్‌

మాతృభాషల మనుగడతోనే రాష్ట్రాల పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏ రాష్ట్ర పురోభివృద్ధి అయినా మాతృభాషల మనుగడతోనే ముడిపడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఐటి, సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మాతృభాష అభివృద్ధి, సంస్కృతీ, సంప్రదాయాలను నిలబెట్టేందుకు టిడిపి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే లేపాక్షి ఉత్సవాల ప్రమోషన్ కోసం శనివారం ఆయన సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి బెంగళూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి సునీత, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రఘునాథరెడ్డి కన్నడ భాషాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎల్.హనుమంతప్పతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, కన్నడ, తమిళం వంటి ద్రవిడ భాషలు వేల సంవత్సరాల నుంచి సజీవంగా ఉన్నాయని, మాతృభాషపై ప్రజలకున్న మమకారమే ఇందుకు కారణమని వివరించారు. ప్రపంచీకరణ ప్రభావం వలన ఆంగ్లం పలు మాతృభాషల్లోకి చొరబడి కొంత ఆందోళన కలిగిస్తోందని, అయినప్పటికీ ప్రజలు మాతృభాషాభిమానంతో దాన్ని నివారించవచ్చని అన్నారు. బెంగళూరులోని శాసనసభ, మండలి భవనాలను మంత్రి పల్లె సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు విధాన సభ అధికారులు ఘనస్వాగతం పలికారు.

కాంగ్రెస్ ‘మేడ్ ఇన్ ఇటలీ’
ఏపికి తీరని ద్రోహం చేసి
దిగ్విజయ్ నీతులు చెబుతున్నాడు
టిడిపి నేత ముద్దుకృష్ణమ ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ పార్టీని ‘మేడ్ ఇన్ ఇటలీ’ అని, ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇపుడు నీతులు చెబుతున్నారని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు తమ అవినీతి సంపాదనను ఇటలీకి తరలించారని, ఇష్టానుసారం అనేక కుంభకోణాలకు పాల్పడటంతో 2014లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదని అన్నారు. అభివృద్ధిలో, అవినీతి రహిత పాలనలో సింగపూర్ అందరికీ ఆదర్శంగా నిలిచిందని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ సాయం తీసుకుంటున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో పదేళ్లు సిఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌ను అక్కడి ప్రజలు తరిమేయడంతో ఇక్కడకు వచ్చి రాష్ట్రాన్ని, కాంగ్రెస్‌ను నాశనం చేశారని విమర్శించారు. సూట్‌కేసులు తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశారని, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, రాజధాని ఎక్కడో చూపించకుండా, ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చకుండా అన్యాయం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని అన్నారు. ఏపికి దిగ్విజయ్ తీరని ద్రోహం చేశారని, అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇప్పించేందుకు రాహుల్ గాంధీ, సోనియా, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ పార్లమెంటు ముందు ఎందుకు దీక్షలు చేయలేదని ముద్దుకృష్ణమ నాయుడు నిలదీశారు.
ఎప్పుడూ కుర్చీ యావే!
జగన్‌కు మరో ఆలోచన లేదు
మాణిక్య వరప్రసాద్ విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజాస్వామ్య విలువల పట్ల గానీ ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల పట్ల గానీ ఏమాత్రం విశ్వాసం లేదని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేస్తానంటూ రాజ్‌భవన్ వద్ద జగన్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమైనవి, దారుణమైనవని మండిపడ్డారు. జగన్ మనసులో సిఎం కుర్చీ తప్ప మరో మరో ఆలోచన లేదని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడి పదవులు పొందాలే తప్ప ఇలాంటి అనవసర ప్రసంగాలు మానుకోవాలని ఆయన జగన్‌కు హితవు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, జగన్‌తో పొసగక చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నారని మాణిక్య వరప్రసాద్ అన్నారు.
ఉక్కాయపల్లి వద్ద వ్యర్థాల డంప్ మూసివేత
కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: వైఎస్‌ఆర్ కడప జిల్లా ఉక్కాయపల్లి వద్ద మున్సిపల్ వ్యర్థపదార్థాల డంప్‌ను మూసివేసి, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఏపి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ ఫణికుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో భాగమైన పారిశ్రామిక కాలుష్య నిర్వహణ ప్రాజెక్టుపై శనివారం ఆయన సనత్‌నగర్‌లోని మండలి ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. ఉక్కాయపల్లి ప్రాజెక్టులో కాంట్రాక్టర్ పాత్ర, అక్కడ కాలుష్యం వెదజల్లకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆయన సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.