ఆంధ్రప్రదేశ్‌

అవిశ్వాసం వీగిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూజువాణి ఓటుతో తిరస్కరించిన సభ
నేడు స్పీకర్‌పై వైకాపా అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సోమవారం అసెంబ్లీలో సుమారు తొమ్మిదిన్నర గంటల పాటు చర్చ జరిగింది. పాలక-ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం మధ్య స్పీకర్ కోడెల శివప్రసాద రావు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మూజువాణి ఓటు చేపట్టి అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల క్రితం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం స్పీకర్ కోడెల తనకు అందిన అవిశ్వాస తీర్మానం నోటీసును చేపట్టేందుకు మద్దతుగా అవసరమైన సంఖ్యా బలం ఉందా? అని పరీక్షించేందుకు వైకాపా ఎమ్మెల్యేలను తమ స్థానాల్లో నిలుచోవాల్సిందిగా సూచించారు. వైకాపా ఎమ్మెల్యేలంతా లేచి నిలుచోవడంతో తీర్మానానికి అవసరమైన 18 ఎమ్మెల్యేల సంఖ్య కంటే ఎక్కువే ఉన్నందున తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తున్నానని చెప్పారు. తేదీ, సమయం నిర్ణయించేందుకు శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సభ్యులను తన ఛాంబర్‌కు రావాల్సిందిగా సూచించి సభను కొంత సేపు వాయిదా వేశారు. బిఎసి సమావేశంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వెంటనే చర్చకు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో, స్పీకర్ వెంటనే చర్చకు అనుమతించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమైన చర్చ పాలక-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదాలు, పరస్పర దూషణ భూషణలతో, సవాళ్ళతో రాత్రి 9.30 గంటల వరకు సాగింది. చివరకు స్పీకర్ కోడెల సభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు మూజు వాణి ఓటు ద్వారా అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు.
స్పీకర్ నిర్ణయం పట్ల వైకాపా ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమకు ‘డివిజన్’ కోరేందుకు కూడా అనుమతించలేదని స్పీకర్‌నుద్దేశించి అన్నారు. అందుకు స్పీకర్ ప్రతిస్పందిస్తూ అప్పటినుంచి తాను చర్చ కొనసాగించాలనే సూచించానని, దానికంటే ముందు సభ్యుల అభిప్రాయం మేరకు మీరు న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచించినా పెడచెవిన పెట్టారని వ్యాఖ్యానించారు. కాబట్టి మూజువాణి ఓటు ద్వారా వీగిపోయిన అవిశ్వాస తీర్మానంపై మళ్లీ ఓటింగ్ చేపట్టడం సాధ్యం కాదని, బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా వైకాపా సభ్యులకు సూచించారు. అయినా వైకాపా ఎమ్మెల్యేలు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తుండగా, స్పీకర్ టిడిపిని చర్చ ప్రారంభించాల్సిందిగా చెప్పారు. టిడిపి తరఫున ప్రభుత్వ విప్ రవి చర్చను ప్రారంభించిన కొద్ది సేపటికే స్పీకర్ కోడెల సభను మంగళవారానికి వాయిదా వేశారు.
స్పీకర్‌పై అవిశ్వాసం: జగన్
స్పీకర్‌పై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు విపక్ష నేత జగన్ చెప్పారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక సభ ముగిసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్పీకర్ తమకు డివిజన్ (ఓటింగ్) చేపట్టాలని కోరేందుకు కూడా సమయం ఇవ్వలేదని అన్నారు. స్పీకర్ తీరుపై తాము మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.
(చిత్రం) అవిశ్వాస తీర్మానంపై చర్చను ఖరారు చేసేందుకు సభా వ్యవహారాల సలహా సంఘం సభ్యులతో చర్చిస్తున్న స్పీకర్ కోడెల