రాష్ట్రీయం

ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో లేదని గొడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జనవరి 2: తెలుగుదేశం పార్టీ గ్రేటర్ సమావేశంలో ఎన్టీఆర్ ఫొటో విషయంలో రభస జరిగింది. వేదిక వెనుక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపట్ల తెలుగు యువత నాయకుడు గంగాధర్‌గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవకు దారితీసింది. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించినప్పటికీ ఫ్లెక్సీలో ఫొటో ఎందుకు పెట్టలేదని, సమావేశాలకు సమచారం అందించకుండా కొంతమంది నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గంగాధర్ ఆరోపించారు. దీంతో నగర అధ్యక్షుడు ఈ సమావేశంలో కేవలం ఇన్‌చార్జ్‌లు, డివిజన్ అధ్యక్షులు పరిశీలకులకు మాత్రమే ఆహ్వానం ఉందని తెలిపారు. ఇంతలో ఎన్టీఆర్‌కు అనుకూలంగా కొంతమంది, నగర అధ్యక్షులు మా గంటికి, ఎంఎన్‌కు అనుకూలంగా మరికొంతమంది నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పరిస్థితి అదుపుతప్పుతోందని గ్రహించిన నేతలు ఇరువర్గాలకూ సర్దిచెప్పారు.