AADIVAVRAM - Others

గొప్పదనం( సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుటి వ్యక్తుల్లో లోపాలు ఎంచడం చాలా సులువు. ఇదే పని చాలామంది చేస్తూంటారు. ఈ అలవాటు పెరిగి పెరిగి చివరికి మనలో వున్న లోపాలను ఎంచే పనిని తరచూ చేస్తుంటాం. కానీ వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు తక్కువగా వుంటాయి.
గొప్పవాళ్ల విషయంలో లోపాలు చాలా తక్కువగా మనకి కన్పిస్తాయి. వాళ్ల బలహీనతలు కూడా మనకి ఆకర్షణీయంగా అన్పిస్తాయి.
ఓ క్రికెటర్ గురించో, ఓ గొప్ప గాయకుడి గురించో, నటుడు గురించో, రాజకీయ నాయకుడి గురించో మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం. కీర్తిస్తాం. తప్పులేదు. వాళ్ల ప్రతిభను గుర్తించాల్సిందే.
ప్రశంసించాల్సిందే!
ఆ మాటకొస్తే ప్రతిభ ఎవరిలో కన్పించినా వాళ్లను ప్రశంసించాల్సిందే!
మన పిల్లల విషయంలో కూడా అలా చేయాలి.
పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు మనం వెంటనే వాళ్లని ప్రశంసించాలి. కానీ ఆ పని మనం చేయం.
ఎందుకో అర్థంకాదు.
కానీ వాళ్లు ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే మందలిస్తాం.
ఇతరుల గొప్పదనాన్ని, ఇతరుల ప్రతిభని గుర్తించడం మంచిదే. ప్రశంసించడం ఇంకా మంచిది.
ఇది మన ఇంట్లో వాళ్ల గురించి కూడా చేయాలి.
పొగడాల్సిన పనిలేదు.
గుర్తిస్తే చాలు.
ఇతరుల సంగతి వదిలేద్దాం.
మన గురించి ఆలోచిద్దాం
మనలో లోపాలే కాదు
కొన్ని గొప్పదనాలు కూడా ఉన్నాయి.
వాటిని ఎప్పుడైనా గుర్తించామా?
ఓ పనిని ఇంట్లో వాళ్లందరి కన్నా మనమే చాలా బాగా చెయ్యగలం.
కొన్ని విషయాల్లో మనకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు వున్నాయి.
వాటిని మనం ఎప్పుడైనా గుర్తించామా?
చాలా తక్కువ మంది ఈ పని చేస్తారు.
మన గొప్పదనం గురించి అహంభావం అవసరం లేదు.
కానీ మన గొప్పదనాన్ని ఇతరులు గుర్తించకపోయినా పర్వాలేదు.
మనమైనా గుర్తించాలి కదా.

మంగారి రాజేందర్ ‘జింబో’94404 83001