రాష్ట్రీయం

ప్రభుత్వ డొల్లతనం బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ ప్రసంగంపై విపక్షాల విసుర్లు

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గోడలు దాటడం లేదని విమర్శించారు. విద్యా హక్కు చట్టం పకడ్బందీగా రావాలని, ఫీజులపై నియంత్రణ ఉండాలని అన్నారు. అధికారంలోకి రాగానే దళితులకు మూడు ఎకరాల చొప్పున ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రెండు పడకల గదుల నిర్మాణంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అవి సాకారం చేయాలని లక్ష్మణ్ కోరారు.
పన్నులు పెంచవద్దు: అక్బర్
మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఆస్తి పన్ను, విద్యుత్తు చార్జీలు, నీటి చార్జీలు పెంచే ఆలోచన ఏదీ చేయరాదని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఇందులో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సెట్విన్‌ను మైనారిటీ కార్పోరేషన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మణికొండలోని సుమారు 700 ఎకరాల వక్ఫ్ భూములను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
గవర్నర్ డైరెక్షన్ ఇవ్వాల్సింది: ఆర్. కృష్ణయ్య
టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ అసెంబ్లీలో చదివారే తప్ప ప్రభుత్వానికి ఒక విజన్ సూచించలేదని అన్నారు.చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. వైకాపా ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే అందజేయాలని కోరారు.
రిజర్వేషన్లు ఏమయ్యాయి?: రవీంద్ర
సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రామావత్ ప్రసంగిస్తూ గిరిజనులకు కల్పిస్తామన్న 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రసంగిస్తూ రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, గిరిజనులకు పోడు, అటవీ భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు.