ఆంధ్రప్రదేశ్‌

దారి మళ్లిన రైతు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో ప్రతిపక్షం వాకౌట్
హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, అంతేకాకుండా, వీరికోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్ నిరసన తెలియచేస్తూ, తన సభ్యులతో పాటు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో 2014-15, 2015-16 సంవత్సరంలో ప్రకృతి వైపరిత్యాల కారణంగా సంభవించిన పంట నష్టం, రైతులకు చెల్లించిన పరిహారం గురించి సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, కోరముట్ల శ్రీనివాసులు, అనిల్‌కుమార్, శ్రీ్థర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సమాధానం చెపుతూ 2015-16లో కేంద్ర ప్రభుత్వం 437 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి, 316 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసిందని అన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, ఇందుకు నష్ట పరిహారం అందించాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ లేచి మాట్లాడుతూ 2013-14 సంవత్సరంలో రైతులకు 1692 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. 2014-15లో ఆయా జిల్లాల కలెక్టర్లు 1500 కోట్ల పరిహారానికి ప్రతిపాదనలు పంపిస్తే, దాన్ని 858 కోట్ల రూపాయలకు పరిమితం చేశారని అన్నారు. 2015-16లో 1021 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ అన్నారు. 2014-15లో కౌలు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 975 కోట్ల రూపాయలను కేంద్రమే మంజూరు చేసిందని, ఇందులో రైతులకు 858 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని అన్నారు. అలాగే 2015-16లో 750 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దమ్మిడీ కూడా విదల్చలేదని జగన్ అన్నారు. ఇందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ్యులతో కలిసి వెళ్లిపోయారు.