Others

నాకు నచ్చిన చిత్రం--చదువుకున్న అమ్మాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1963లో విడుదలై లవకుశ పోటీకి తట్టుకుని వంద రోజులు ఆడిన చిత్రం చదువుకున్న అమ్మాయిలు. నాగేశ్వరరావు, సావిత్రి, కృష్ణకుమారి, పద్మనాభం, శోభన్‌బాబు మొదలగువారు చిత్రంలో నటించారు. పద్మనాభం దుష్టపాత్ర ధరించడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. కొన్ని అనూహ్య మలుపులు తిరిగిన తర్వాత సుజాత (సావిత్రి), ప్రభాకర్ (శోభన్‌బాబు)ను పెళ్లాడటానికి అంగీకరిస్తుంది. పద్మనాభం కుట్రలను సుజాత భగ్నంచేసి శేఖర్ (నాగేశ్వరరావు) వసంత (కృష్ణకుమారి)లను కలుపుతుంది. ఇదీ సంక్షిప్తంగా కథ.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి. మొదట నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు ఈ చిత్రానికి కథా రచయిత డా. శ్రీదేవిని స్క్రిప్టు రాయవలసిందిగా కోరాడు. ఈ పని కాకుండానే ఆమె కాలధర్మం చెందడంతో ఆయన త్రిపురనేని గోపీచంద్ సలహాపై ‘యద్దనపూడి సులోచనారాణి’ మరొక ప్రసిద్ధ రచయిత్రిని స్క్రిప్టు పూర్తిచేయమని కోరాడు. ఈ విధంగా ఆవిడ సినిమా ప్రపంచానికి పరిచయమైంది. ఒకరుకన్నా ఎక్కువ మంది రచన దుక్కిపాటికి అంతగా సంతృప్తి కలిగించక పోయినా దానిని సమర్ధవంతంగా తెరకెక్కించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.
ఆరుద్ర, కొసరాజు, దాశరథి, నారాయణరెడ్డి రాసిన పాటలకు సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ఎక్కువ భాగం హైద్రాబాద్ సారథి స్టూడియోలో జరిగిన కొన్ని సన్నివేశాలను మద్రాస్ హోటల్ అశోకాలో, మద్రాసు విశ్వవిద్యాలయంలో చిత్రీకరించారు. ‘మీరు నా మాట నమ్మాలి’ అన్న పద్మనాభం ఊతపదం చాలాకాలం ప్రేక్షకులలో ఉండిపోయింది.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం