Others

అంత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-‘అవకాశాలు అడుక్కుంటే వచ్చేవి కావు. కెరీర్‌ని ఆ స్థాయికి నేనింకా దిగజార్చుకోలేదు’ అని ఘాటుగా సమాధానమిస్తోంది తాప్సీ. ఆమె కోపానికి కారణం లేకపోలేదు. -‘ఘాజీ’లో చాన్స్ రానా ఇప్పించాడని ప్రచారం జరుగుతోందట. అదీ -తాప్సీకి చిర్రెత్తించిన విషయం. ‘రానా నాకు మంచి స్నేహితుడు. అంతమాత్రం చేత సినిమా అవకాశాల కోసం ఫ్రెండ్షిప్‌ని వాడుకునేంత బలహీనమైన వ్యక్తిత్వం కాదు నాది’ అంటోందట ఢిల్లీ బ్యూటీ. తెలుగు తెరపై గంపెడంత ఆశతో వచ్చిన తాప్సీని అప్పట్లో పట్టించుకున్న వాళ్లు లేరు. దీంతో కోలీవుడ్‌కి మకాం మార్చింది. బబ్లీ గాళ్స్‌ని తప్ప బక్కపల్చని హీరోయిన్లను ఇష్టపడని కోలీవుడ్‌లోనూ -తాప్సీకి పెద్ద చాన్స్‌లు పడలేదు. చివరకు -బాలీవుడ్‌కు ఎగిరిపోయిన తాప్సీ అక్కడే ఓ రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ‘బేబి’, ‘పింకీ’లు ఇచ్చిన హిట్టు ఊపులోవున్న తాప్సీ -‘ఘాజీ’లో మెరుపులు మెరిపించనుందట. లేనిపోనివి ఎప్పుడూ పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ మనమేంటో మనకు తెలిస్తే చాలు’ అంటూ గడుసు సమాధానమిస్తున్న తాప్సీ -‘ఘాజీ’తో రేంజ్ మరింత పెరుగుతుందన్న ధీమాతో ఉంది.