Others

హైకోర్టుకెక్కిన అందాల పాదరక్షలు! (వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పులు, బూట్లు, సాండల్స్, స్లిప్ ఆన్స్, కిక్ ఆన్స్- లాంటి రకరకాల పేర్లతో- మగ, ఆడ చెప్పులు తయారవుతున్నాయ్. అన్నీ పాదరక్షలే. కాకపోతే ఆడాళ్లు అందమయిన పాదరక్షలు ధరిస్తారు. మగాళ్లు అవసరమయిన జోళ్లు వేసుకుంటారు. కానీ, రుూమధ్యనే వయ్యార భామలయిన అమ్మాయిలు ధరించే చెప్పల్స్ హైకోర్టుకెక్కాయి.
మడమ చుట్టూ పటకా వున్న అందాల పాదరక్షల నిర్వచనంలో గవర్నమెంటు వారి కస్టమ్స్‌శాఖ వారికి మీమాంస వచ్చింది. 2003నాటి కథ యిది. ఇప్పటిదాకా హైకోర్టు చుట్టూ తిరిగి- అటు గవర్నమెంటుకీ, యిటు చెప్పుల తయారీ సంస్థ విషాల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారికి కూడా చాలా జతల పాదరక్షలు అరిగిపోయాయ్. తీర్పు యిప్పుడొచ్చింది!
ఈ కంపెనీ చెన్నైలో వుంది. పట్టువిడవని విక్రమార్కుడి లాగా, ఆడాళ్లు వేసుకుని తిరిగే బెల్టుచెప్పులు కూడా సాం డిల్సేనని వాదించింది. ఎందుకంటే అదేదో ఆడాళ్ల ప్రతిష్ఠ సంగతి కాదు. ఎగుమతి చేయబడ్డవి ‘సాండల్స్’ అయితే కష్ట మ్స్ డ్యూటీలో పది శాతం మినహాయింపు వుం టుంది. చెప్పల్స్ అనగా చెప్పులే. కానీ వీటికి డ్యూటీ (సుంకం) ఐదు శాతం మినహాయింపు మాత్రమే వుంటుంది.
‘‘మేం ఎగుమతి చేసినవి సాండల్సే. కనుక బిల్లు మొత్తం సాండల్స్‌గానే భావించి ముదరా యివ్వండి’’- అంటూ కోర్టుకెక్కింది ఆ కంపెనీ. చెప్పుల రకం యిది అని నిర్ణయించి నిర్వహించే కమిటీ ఒకటి వుంది. వాళ్లు, ‘‘బెల్టుచెప్పులు సాండల్స్ కావు’’- అన్నారుట. కానీ యిద్దరు న్యాయమూర్తులున్న ధర్మాసనం రుూ కేసును విచారించింది.
ఎత్తుమడమలుంటే మడమ త్రాడుకన్నా, లేకపోయినా ఆ - ‘చెప్పు’ని సాండల్‌గానే తీర్మానిస్తు న్నాం’’-అంటూ నిర్ద్వంద్వంగా- బెల్టులేని పడతుల పాదరక్షలు అన్నీ- సాండల్స్ అన్న నిర్వచనం క్రిందికి వస్తాయి. అంచేత ఎగుమతి సుంకం రాయితీ యివ్వాల్సిందే.
లోగడ హవాయ్ స్లిప్పర్స్‌ని (బాత్‌రూమ్) స్ట్రాప్స్‌నీ విడిగా అమ్మేవారు. అంటే అది డ్యూటీ ఎగవేత కోసమే. అటువంటి కమ్మరి కిటుకు ‘‘సాండల్స్’’ విషయంలో చెల్లలేదు. పిటీ!

-వీరాజీ