Others

అలా ఎలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల ప్రదర్శనకు దూరంగా అగ్రస్థానం అందుకోవడం అన్నది -హీరోయిన్ల విషయంలో ఒకప్పటి మాట. అప్పటి సినిమాలు, కాలమాన పరిస్థితుల కారణంగా ఎక్స్‌పోజింగ్ టాక్ లేకుండానే కెరీర్ కంప్లీట్ చేసేశారు. ఇప్పటి సినిమా పరిస్థితి వేరు. గ్రామర్ లేకున్నా గ్లామర్‌తో నాలుగు సీన్లు పండించడమే పాత్ర పరమావధి అన్నట్టే -హీరోయిన్లకు చాన్స్‌లు దొరుకుతున్నాయి. అలాంటి ప్రస్తుత తరుణంలో -పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబితే లీడ్ రోల్ కాదుకదా, క్యారెక్టర్ రోల్ పడటం కూడా కష్టమే. ‘గ్లామర్ షో’కు నో అని -స్టేట్‌మెంట్ ఇచ్చిన మరుక్షణం పరిశ్రమ నుంచి పెట్టేబేడా సర్దుకోవాల్సిన పరిస్థితులు లేకపోలేదు. అయితే -అలాంటి బెదిరింపుల్ని తాను లెక్కచేసేది లేదంటోంది కీర్తి సురేష్. నడుమొంపులు చూపించడం స్క్రీన్ సీన్‌కు సర్వసాధారణమే అయినా -తాను మాత్రం చూపించేది లేదని కుండబద్ధలు కొట్టిమరీ చెప్తోందట. ఎక్స్‌పోజింగ్‌కి చాన్స్ లేకుండా -నిండుగా కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తా. అందుకు ఒప్పుకుంటేనే -కాల్షీట్లు, అగ్రిమెంట్ మీద సంతకం అని తెగేసి మరీ చెప్తోందట. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కీర్తికి ఇంత గుండెధైర్యమా? అని ఆశ్చర్యపోయేవాళ్లూ ఉన్నారు. అవకాశాల కోసం మాట మార్చకుండా కడవరకూ అదే పంథా కొనసాగిస్తే -నిజంగా కీర్తి హీరోయిన్ కాదు, హీరోనే అంటున్న వాళ్లూ ఉన్నారు. ‘కీర్తిం’చినా, కీర్తించకున్నా ఫరవాలేదుగానీ -నా దగ్గర ఆ చర్చే తేవొద్దు అని గట్టిగానే చెబుతోందట కీర్తి. గ్రేట్!