Others

ఉపన్యాస సమ్రాట్ (శరత్కాలం_

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవయ్యో దశకం నుంచి హైదరాబాద్‌లో సాంస్కృతిక వాతావరణం ప్రారంభమైందన్నట్టు -లెక్కలేనన్ని సభలు, సమావేశాలు జరుగుతుండేవి. కాస్త వెనక్కి వెళ్తే -మద్రాసులో జరిగిన ఒక సినీ సమావేశంలో అక్కినేని ప్రసంగిస్తూ -తెలుగు సినిమా వారిపై మద్రాసు రాష్ట్ర (నేటి తమిళనాడు) సినిమా చిన్న చూపు చూస్తోందని వ్యాఖ్యానించటం పలువురి మనోభావాలను గాయపర్చింది. ఎన్టీఆర్ సహా పలువురు ఘాటుగా ఖండించారు. రామాచారి సంపాదకీయంలో వెలువడే ‘నటన సినీ పత్రిక’ దాన్ని వివరాలతో వరుసగా ప్రచురించింది. అక్కినేని హైదరాబాద్‌కు చేరిన తర్వాత మద్రాసు వాతావరణాన్ని మరిపింపచేస్తూ వెండితెర సంపాదకుడు శాండిల్య ‘సెవెన్ స్టార్స్ సిండికేట్’ ద్వారా అంతర్ కళాశాలల నాటక పోటీలతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కినేని బిజీగా ఉండేలా మార్చారు. ఆ సమయంలోనే కీశే ఆర్‌వి రమణమూర్తి, ఏపి సినీ గోయర్స్ అసోసియేషన్ ద్వారా కీశే బి కిషన్ పలు సినీ కార్యక్రమాలు నిర్వహిస్తూ సినీ అభిమానులను ఆనందపర్చేవారు. కేవలం తెరమీద మాత్రమే సినిమా కళాకారులను చూసి ఆనందించే ప్రేక్షకులు, అభిమానులు.. అలా పలు కార్యక్రమాల ద్వారా వేదికలమీద అక్కినేనితోపాటు పలువురు కళాకారులను ప్రత్యక్షంగా చూస్తూ ఆనందించేవారు.
అక్కినేని పలు ఆసక్తికరమైన సినిమా విశేషాలు వివరిస్తూ ఉపన్యాస సమ్రాట్ అనిపించుకొనేవారు. శాండిల్య నిర్వహించే సెవెన్ స్టార్స్ సిండికేట్ సంస్థకు అక్కినేనితోపాటు సావిత్రి, దుక్కిపాటి మధుసూదనరావు ఒక పాలక వర్గంగా వ్యవహరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు.
ఆనాడు అక్కినేని ప్రారంభించిన సాంస్కృతిక వాతావరణం మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లి నిత్యం ఏదోక సినీ కార్యక్రమంతో అటు రవీంద్రభారతి, ఇటు త్యాగరాయ గానసభలోని మూడు వేదికలు బిజీ కార్యక్రమాలతో అలరారాయి. సెవెన్ స్టార్స్ సిండికేట్‌ను ఆదర్శంగా తీసుకొని నేడు హైదరాబాద్ సాంస్కృతిక రంగంలో రాజధాని నిత్యం పలు వినూత్న కార్యక్రమాలతో విరాజిల్లుతోంది.
సెవెన్ స్టార్స్ సిండికేట్ ప్రారంభ దశలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు, శారద, చలంతోపాటు ముఖ్య నిర్వాహకుడు శాండిల్య హాజరైనపుడు కెమెరా క్లిక్ మనిపించిన అపురూప చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717