Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడచిన సంక్రాంతి సినిమాల తరువాత సరైన ఎంటర్‌టైనర్ రాకపోవడంతో -మూడురోజుల క్రితం థియేటర్లకు వచ్చిన నాని సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ‘నేను లోకల్’ అంటూ మాస్ ఎలిమెంట్స్ టేస్ట్‌తో నాని చేసిన ప్రయత్నం -ఆడియన్స్‌ని సంతృప్తిపర్చింది. పండుగ వినోదాన్ని అందించే లక్ష్యంతో విడుదలైన ‘ఖైదీ..150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘శతమానం భవతి’ చిత్రాలు గత మూడు వారాలుగా థియేటర్ల వద్ద హడావుడి చేశాయి. జనవరి 26న విడుదల కావాల్సిన సింగం-3 వెనక్కి జరగడంతో -ఆ డేట్‌లో హడావుడిగా విడుదలైన విష్ణు ‘లక్కున్నోడు’ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పబ్లిక్ హాలిడేకి విడుదలైనా -నామమాత్రపు ఓపెనింగ్స్ లేకపోవడంతో -ఆడియన్స్ మళ్లీ పండుగ సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. చిరు సినిమా వంద కోట్ల షేర్‌తో, శతమానంభవతి 30 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించాయి. హిట్ స్టేటస్‌తో ‘శాతకర్ణి’ బలంగా నిలబడింది. కొత్త ఎంటర్‌టైనర్ కోసం చూస్తున్న ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ ‘నేను లోకల్’, అనువాద చిత్రం ‘కనుపాప’, జాకీచాన్ ‘కుంగ్‌ఫూ యోగా’ థియేటర్లకు వచ్చి ఓకే అనిపించుకున్నాయి. మిగిలిన మూడు వారాల్లో -వారానికి ఒకటి చొప్పున పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద హడావుడి కనిపిస్తోంది.