Others

సమంత స్ట్రాటజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత లక్కు లెక్కపెట్టాలంటే -కొత్త
ఫార్ములాలు కనిపెట్టాలి. పరిశ్రమలోకి
అడుగుపెట్టింది మొదలు
-ఆమె కెరీర్ గ్రాఫ్ రవ్వంత కిందికి దిగిన
దాఖలాలు లేవు. ఒకట్రెండ్ ఫ్లాప్ సినిమాలు పడినా
-ఆమె పాత్ర వరకూ హిట్టు మార్కులే పడుతున్నాయి.
సమంతవుంటే సినిమా హిట్టేనన్న రేంజికి చేరిపోయింది. కెరీర్
ఊపుమీదున్న టైంలోనే -నాగచైతన్యతో నిశ్చితార్ధం జరగడంతో ఇక ఆమె సినిమాలు తగ్గిస్తుందని అందరూ
అనుకున్నారు. పోటీలో సమంత ఉండదు కనుక -చాన్స్ కలిసొచ్చినట్టేనని తోటి హీరోయిన్లూ ఆశించారు. కానీ -కొత్త స్ట్రాటజీతో వస్తున్న సమంత అందరికీ పజిల్‌గానే మారింది. నాగార్జున కాంపౌండ్‌లోకి అడుగు పెట్టడంతోనే -ఆమెతో సినిమాలు చేయడానికి మరింతగా క్యూ కడుతున్నార్ట. ప్రస్తుతం నాగ్ చేయనున్న ‘రాజుగారి గది-2’లో సమంత నటిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఇదికాకుండా రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ చేయబోయే సినిమాలో సైతం అనుపమను పక్కనపెట్టి సమంతను ట్రాక్‌మీదికి తెచ్చారు. సమంత మరింతగా సినిమాలు పెంచేస్తుంటే -ఆమెను ఆపడం ఇక ఎవరితరమంటూ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.