Others

పన్నీటితో పెరిగే అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వసాధారణంగా అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు పనికి వచ్చేవాటిలో ‘పన్నీరు’ కూడా ఉంటుంది. ఈ పన్నీటిని మనం మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పన్నీటి తయారీకి, లేత గులాబీ రంగున్న పూలను తీసుకుంటే ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది. 50 లేత గులాబీ రేకులను తీసుకుని రెండు లీటర్ల వేడి నీటిలో వేయాలి. ఆ నీరు బాగా మరిగి సగం అయిపోయిన తరువాత బాగా చల్లారనివ్వాలి. ఆ తరువాత దానిని ఒక సీసాలో పోసుకుని రిఫ్రిజిరేటర్‌లో నిలువ ఉంచుకుని, అవసరమైనపుడు ఐస్‌ట్రేలలో పోసుకుని వాడుకోవచ్చు. ఈ పన్నీరుతో అందాన్ని మరింతగా పెంచుకోవడానికి, మెరుగులు దిద్దుకోవటానికి ఎలా వాడాలో చూద్దాం!
గర్భవతి అయిన స్ర్తి ప్రసవించిన తరువాత కడుపుపైన ఏర్పడే గీతలను పోగొట్టటమేకాక, తిరిగి రాకుండా చేయగలదు పన్నీరు. అదెలాగంటే, అరచెంచా కస్తూరి పసుపు, ఒక చెంచా దోసగింజల పొడి, పావు చెంచా పాలు- వీటితో కొంత పన్నీరును చేర్చి ఆ మిశ్రమాన్ని పొట్టమీద మచ్చలు, గీతలు ఉన్న చోట రాసుకుని, అయిదు నిమిషాల తరువాత స్నానం చేయాలి. దానితో ఆ మచ్చలు మటుమాయమైపోతాయి. గర్భవతి అయిన స్ర్తి ఏడవ నెల నిండిన తరువాత నుంచి పొట్టపైన ఈ మిశ్రమాన్ని రాసుకుంటూంటే అసలు మచ్చలు, గీతలు రానే రావు.
ముఖ అందం పెంచుకునేందుకు కొందరు మేకప్ వేసుకున్న తరువాత కూడా వారి ముఖం జిడ్డుకారుతూ ఉంటుంది. అలాగే కొందరి ముఖం పీలగా, డల్‌గా ఉంటుంది. అలాంటి ముఖారవిందాన్ని మెరిపించి అందాన్ని పెంచే గుణం పన్నీటికి ఉంది. ఇందుకోసం- అరచెంచా చొప్పున ముల్తానీ మట్టి, చందనం పొడి, వీటితోపాటుగా తగినంత పన్నీరు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, ఆరిపోయాక కడిగేసి, అటుపైన మేకప్ వేసుకోవాలి. ఇలాచేయటంవల్ల ముఖానికో కొత్త ఉత్తేజం కలుగుతుంది. మీరు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేంతవరకు ముఖం తాజాగా మెరుస్తూ వుంటుంది.
ముఖానికి ఫేషియల్ చేయించుకుంటే ఎంతందంగా వెలిగిపోతూ కనిపిస్తారో చెప్పనక్కర లేదు కదా! ఇందుకు అరచెంచా దోసగింజల పొడికి పావు చెంచా జాజికాయ పొడి, పావు చెంచా పంచదార, పావుచెంచా వెన్న కలిపి, ఆ మిశ్రమానికి తగినంతగా పన్నీటిని కలపాలి. ఆ పేస్టును వారానికి ఒకసారి ముఖానికి, మెడ భాగానికీ రాసుకోవాలి.
ఇలా చేయడంవల్ల ముఖభాగం, మెడ భాగం మృదువుగా మారి చక్కగా ప్రకాశించటమే కాక, ముఖంపైన కనిపించే మొటిమలు కూడా దూరమైపోతాయి.

- మనస్విని