Others

ఇంటి నామ ఫలకం మీద ‘అమ్మాయి!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్తారింటి కి పోతూనే యింటి పేరు మారిపోయే సంప్రదాయమున్నచోట- డిగ్రీలో పుట్టింటి పేరే వున్నందున చాలామంది విద్యావంతులు డబుల్ యింటిపేర్లను సందర్భోచితంగా వాడుకుంటూండటం గమనించే వుంటారు గానీ ఇంటి వీధి తలుపుమీద ఆడపిల్ల పేరు పెట్టడం యించుమించుగా ఎక్కడా లేదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలోని వూళ్ళల్లో- కొంతమంది తల్లిదండ్రులు తమ యింటి వీధి తలుపుమీద కూతురి పేరు వేయించిన నామఫలకాలను (నేమ్‌ప్లేట్స్)ని ప్రదర్శిస్తున్నారు. స్ర్తిల సాధికారతా ఉద్యమాన్ని యిది ఉల్లేఖిస్తుందని వారి నమ్మకం.
మందసౌర్ అనే వూళ్ళో కనీసం వంద నామఫలకాలమీద ఆ యింటి ఆడబిడ్డల పేర్లు కనబడుతున్నాయని విలేఖర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించి గుర్తించారు. ఈ పద్ధతి నిజానికి జనవరి 24న అనగా జాతీయ బాలికల దినోత్సవంనాడు మొదలయ్యింది. ‘‘నా పేరెట్టారు వీధి గోడమీద, అంటే రుూ యిల్లు మా అన్నయ్యదీ, నాదీ కూడా నన్నమాట’’- అంటూ ఒక పనె్నండేళ్ల పాప ప్రెస్ టీమ్‌ని పలికరించింది.
హర్యానాకి చెందిన మహిళా వస్తాదులు- కామనె్వల్తు బంగారు పతకాలు తెచ్చి- దేశ ప్రతిష్ఠని యినుమడింపజేసిన గీతా, బబితా అప్పచెల్లెళ్లమీద విడుదలయిన సినిమా ‘దంగల్’ కూడా రుూ నేమ్‌ప్లేట్స్ విప్లవానికి దోహదించింది. కమోచ్ అనే గ్రామంలో యింటింటికీ- ఆ యింటి ఆడపిల్లల పేర్లు- పంచాయితీ నిధులతో పెట్టించడం ఒక విశేషం. ఈ గ్రామంలో ఆడపిల్లల సంఖ్య చాలా ఎక్కువ. ఐతే, ఆడపిల్లల భాగస్వామ్యాన్ని ఎక్కువ చేసే ఇంకా ఏవయినా కార్యక్రమాలు తలపెట్టాలి. అప్పుడు యిది విజయవంతమవుతుంది.